తెలంగాణ

telangana

RGV ON JAGAN: 'జగన్ గారు.. మీ చుట్టూ ఉన్న వాళ్లతో జాగ్రత్త'

By

Published : Jan 7, 2022, 2:12 PM IST

RGV ON JAGAN: 'జగన్ గారు.. మీ చుట్టూ ఉన్న వాళ్లతో జాగ్రత్త'
RGV ON JAGAN: 'జగన్ గారు.. మీ చుట్టూ ఉన్న వాళ్లతో జాగ్రత్త'

14:02 January 07

RGV ON JAGAN: 'జగన్ గారు.. మీ చుట్టూ ఉన్న వాళ్లతో జాగ్రత్త'

గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ ధరల విషయంలో టాలీవుడ్ సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ దుమారం.. సంచలన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ ఎంటర్ కావడంతో హాట్ టాపిక్​గా మారింది. ఏపీ మంత్రుల మాట తీరు, జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు ఆర్జీవీ. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్‌ని ఉద్దేశిస్తూ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

'వైకాపాలో నేను నమ్మే ఒకే ఒక్క వ్యక్తి వై.ఎస్. జగన్. ఆయన చుట్టూ ఉన్న వైకాపా లీడర్స్ జగన్​ను తప్పుదోవ పట్టిస్తూ వారికి అనుగుణంగా ఆయనను వాడుకుంటున్నారు. జగన్ గారు.. మీ చుట్టూ ఉన్న వాళ్లతో జాగ్రత్త. మీ పట్టుదల, ప్రవర్తనను చూసి నా తల్లి, సోదరి ఓటు వేశారు. కానీ మీ చుట్టూ ఉంటూ మీ ఇమేజ్ డామేజ్ చేసే వారిని చూసి షాకవుతున్నారు'' అంటూ ఆర్జీవీ కామెంట్ చేశారు.

ఈ సందేశం చూసి 'ఇది కొడాలి నాని కోసం వేసింది అనుకుంటా' అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: RGV Tweets on Cinema Ticket Price : ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ ట్విటర్​ దాడి

TAGGED:

rgv jagan

ABOUT THE AUTHOR

...view details