తెలంగాణ

telangana

Job notifications: ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ.. !

By

Published : Feb 10, 2022, 2:49 AM IST

Job vacancy in telangana: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల కసరత్తు కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ ఖాళీలు వచ్చేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగ సంబంధిత అంశాలపై ఇప్పటికే ఏర్పాటైన కమిటీ.. జిల్లాల వారీగా కేడర్‌ స్ట్రెంత్‌ ఖరారుపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే... ఖాళీల వివరాలను మంత్రివర్గానికి నివేదించనున్నారు.

Job notifications in telangana
Job notifications in telangana

Govt Job notifications in telangana: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ దిశగా కసరత్తు జరుగుతోంది. ఖాళీల భర్తీ కోసం అవసరమైన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్న సీఎం KCR ఆదేశాలకు అనుగుణంగా... అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి శేషాద్రి నేతృత్వంలో IAS అధికారులు స్మితా సబర్వాల్, దివ్య, లోకేష్ కుమార్ సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 60 వేల ఖాళీలు గుర్తించారు.

అన్ని జిల్లాల్లోనూ ఖాళీలు ఉండేలా..

new zonal system in telangana: మరోవైపు కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తైంది. స్పౌస్ కేసులు, అభ్యంతరాలకు సంబంధించిన అప్పీళ్ల ప్రక్రియ తుదిదశలో ఉంది. అయితే ఖాళీలు ఉంటేనే స్పౌస్ కేసులను పరిగణలోకి తీసుకోనున్నారు. కొత్త స్థానికత ఆధారంగా జిల్లా, జోనల్, బహుళ జోనల్ కేడర్లోని ఖాళీలకు సంబంధించిన స్పష్టత వచ్చింది. ఇక పోస్టింగుల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల సమాచారం సర్కార్ చేతికి అందింది. అన్నింటిని పరిగణలోకి తీసుకొని జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంత్ ఖరారు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ ఖాళీలు ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

నెలాఖరులోగా నోటిఫికేషన్లు:

నూతన చట్టం ప్రకారం రాష్ట్రప్రభుత్వం 72 కొత్త పురపాలికలు ఏర్పాటు చేసింది. వాటికి పూర్తిస్థాయిలో పోస్టులు మంజూరు చేయలేదు. ఆయా పురపాలికలకు పోస్టుల మంజూరు విషయమై సర్కారు కసరత్తు చేస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని ఖాళీలతో జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించనున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు, పొరుగుసేవల పద్ధతిన పనిచేస్తున్న పోస్టుల సంబంధిత ఖాళీలు సహా అన్నింటి వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన అంశాలు, భర్తీ విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:Women Attack On Driver: ఆర్టీసీ డ్రైవర్​పై మహిళ వీరంగం.. ఎంత ఆపినా ఆగకుండా..

ABOUT THE AUTHOR

...view details