ETV Bharat / city

Women Attack On Driver: ఆర్టీసీ డ్రైవర్​పై మహిళ వీరంగం.. ఎంత ఆపినా ఆగకుండా..

author img

By

Published : Feb 9, 2022, 9:34 PM IST

Women Attack On Driver:ఏపీలోని రాజ్‌భవన్‌ రోడ్డులో ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ వీరంగం సృష్టించింది. తన ద్విచక్రవాహనానికి బస్సు తగిలిందని ఆగ్రహంతో డ్రైవర్​పై విచక్షణారహితంగా దాడి చేసింది. అంతటితో ఆగకుండా డ్రైవర్​పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

women-attack-on-rtc-driver-in-vijayawada
women-attack-on-rtc-driver-in-vijayawada

ఆర్టీసీ డ్రైవర్​పై మహిళ వీరంగం.. ఎంత ఆపినా ఆగకుండా..

Women Attack On Driver: ఆర్టీసీ బస్సు తన ద్విచక్ర వాహనానికి తగిలిందని ఓ మహిళ.. రచ్చరచ్చ చేసింది. బస్సు డ్రైవర్​ను ఇష్టమున్నట్టు కొడుతూ వీరంగం సృష్టించింది. ఎంత మంది సముదాయించినా.. వినకుండా శిగమొచ్చినట్టు డైవర్​ మీద తన ప్రతాపం చూపిస్తూ హల్​చల్​ చేసింది. ఈ ఘటన ఏపీలోని విజయవాడ సూర్యారావు పేట ఐదో నంబరు రోడ్డులో చోటుచేసుకుంది.

శివాలెత్తిన మహిళ..

నగరంలో రద్దీగా ఉండే ఐదో నెంబర్ రోడ్డులో సదరు మహిళ స్కూటీపై రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు అనుకోకుండా తగలడంతో.. అదుపుతప్పి కింద పడిపోయింది. ప్రమాదం సమయంలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కింద పడిన మహిళ.. పైకి లేచి కోపంతో ఊగిపోయింది. కొంచమైతే తన ప్రాణాలు పోయేవంటూ.. శివాలెత్తింది. బస్సు డ్రైవర్​ను దుర్భాషలాడుతూ భౌతిక దాడికి దిగింది. ఇష్టమొచ్చినట్టు కొడుతూ.. అంగి చింపేసింది. స్థానికులు చేరుకుని మహిళను ఎంత నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. మాట వినకుండా డ్రైవర్​ను కొడుతూనే ఉంది. ఇంక తన కోపం తగ్గపోవటంతో.. ఇంజిన్​ పైకి ఎక్కి మరీ.. డ్రైవర్​ను చెప్పు కాళ్లతో తన్నింది. మహిళ ఇంత చేస్తున్నా.. డ్రైవర్​ మాత్రం ఓపికతో ప్రతిఘటించకుండా మిన్నకుండి పోయాడు.

రద్దీ రోడ్డు కావటంతో.. బస్సు నిలిపోగా.. ట్రాఫిక్​ భారీగా నిలిచిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.