తెలంగాణ

telangana

Red sandalwood dump seized: భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. విలువ రూ. 2 కోట్లపైనే!

By

Published : May 17, 2022, 2:59 PM IST

Red sandalwood dump seized: ఏపీ వైఎస్సార్​ జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపంపల్లెలో భారీ ఎర్రచందనం డంప్‌ను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. రవాణాకు సిద్ధంగా ఉన్న రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

Red sandalwood
Red sandalwood

Red sandalwood dump seized: ఏపీ వైఎస్​ఆర్​ జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపంపల్లెలో నిల్వ ఉంచిన భారీ ఎర్రచందనం డంప్​ను పోలీసులు పట్టుకున్నారు. ఒంటిమిట్ట, సిద్ధవటం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి.. తమిళనాడుకు తరలించేందుకు సిద్ధంగా ఉంచగా స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 2 టన్నుల బరువున్న.. వంద ఎర్రచందనం దుంగలను సీజ్​ చేశారు. స్మగ్లింగ్ చేస్తున్న జిల్లాకు చెందిన ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరిలో రైల్వేకోడూరుకు చెందిన అటవీశాఖ వాచర్ రమేశ్​ కూడా ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి ఎర్రచందనం దుంగలతో పాటు కారు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన వారిలో ఇద్దరు నిందితులపై పీడీయాక్టు నమోదు చేస్తామన్న ఎస్పీ అన్బురాజన్.. ఎక్కువ కేసులున్న బడాస్మగ్లర్ల ఆస్తులు కూడా జప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను అటవీశాఖకు అటాచ్ చేశామని వెల్లడించారు.

ఎర్రచందనం దుంగలను నరికి తమిళనాడుకు తరలించేందుకు సిద్ధంగా ఉంచగా స్వాధీనం చేసుకున్నాం. రూ.2 కోట్ల విలువైన 2 టన్నుల బరువున్న.. వంద ఎర్రచందనం దుంగలను సీజ్​ చేశాం. ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశాం. వీరిలో రైల్వేకోడూరుకు చెందిన అటవీశాఖ వాచర్ రమేశ్​ కూడా ఉన్నారు.--ఎస్పీ అన్బురాజన్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details