తెలంగాణ

telangana

వినాయక నిమజ్జనం.. భక్తులతో కలిసి స్టెప్పులేసిన పోలీసులు

By

Published : Sep 2, 2022, 10:59 PM IST

Dance in Vinayaka Immersion: వినాయక నిమజ్జనం అనగానే ఊరేగింపులు, డీజే స్టెప్పులు గుర్తొస్తాయి. వాడవాడలా నుంచి వచ్చే గణనాథుల ఊరేగింపులతో రోడ్లన్నీ కిటకిటలాడుతాయి. వినాయక నిమజ్జనంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ వాయిద్యాలకు అనుగుణంగా చిందులేస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ కలిసి స్టెప్పులేస్తారు. అక్కడక్కడ భద్రత కోసం వచ్చిన పోలీసులు సైతం భక్తులతో కలిసి డ్యాన్స్​లేస్తారు.

Dance in Vinayaka Immersion
భక్తులతో కలిసి స్టెప్పులేసిన పోలీసులు

Dance in Vinayaka Immersion: ఏపీలోని పలు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్దలతో పూజలు చేసి.. డప్పులు, తీన్మార్​ స్టెప్పులతో గణనాధుడ్ని సంతోషంగా గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొంటున్నారు. వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులేస్తున్నారు. వినాయక నిమజ్జనం భద్రత కోసం వచ్చిన పోలీసులు సైతం భక్తులతో కలిసి సరదాగా స్టెప్పులేస్తుంటారు.

SI dance in Devanakonda: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం వేళ ఎస్‌ శ్రీనివాసులు సందడి చేశారు. శోభాయాత్రలో యువకులతో కలిసి నృత్యాలు చేశారు. వాయిద్యాలకు అనుగుణంగా చిందేసి యువకులను ఉత్సాహపరిచారు. అప్పటివరకు ఊరేగింపునకు భద్రత కోసం వచ్చాడనుకున్న యువకులు.. ఎస్ఐ డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తరువాత శ్రీనివాసులుతో కలిసి అందరూ హంగామా చేస్తూ.. వివిధ పాటలకు స్టెప్పులేశారు.

Police Dance in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా సాగింది. శుక్రవారం తాడిపత్రిలో 250 గణేశ్‌ ప్రతిమల్ని నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేయగా.. భద్రతా ఏర్పాట్లు ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందితో కలిసి గణేశ్‌ శోభాయాత్రలో పాల్గొన్నారు. భక్తులు, పోలీసు అధికారులతో కలిసి నృత్యం చేసి... సందడి చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details