తెలంగాణ

telangana

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం..

By

Published : Aug 3, 2022, 6:53 PM IST

Police Command Control Center: పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని సీపీ సీపీ ఆనంద్​ తెలిపారు. పర్యావరణహిత, ఐకానిక్​ భవనాన్ని రేపు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.

Police Command Control Center is ready to inauguration
Police Command Control Center is ready to inauguration

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం..
Police Command Control Center: హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ చేతుల మీదుగా ఈ కేంద్రం రేపు ఘనంగా ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని.. తెలంగాణ పోలీసు శాఖను దేశంలోనే ఆదర్శంగా నిలపటమే లక్ష్యంగా ఈ సెంటర్‌ రూపుదిద్దుకున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. అత్యాధునిక సాంకేతికత సదుపాయాలతో ఈ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.

"సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవటంలో ముందుండాలనే లక్ష్యంతో.. అన్ని విభాగాలను సమన్వయపరిచి ఒక ఫ్యూజన్​ సెంటర్​లా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్​ తెలిపారు. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. దీన్ని పర్యవరణహిత భవనంగా కట్టాం. దీన్ని ఐదు టవర్లుగా విభజించాం. టవర్​-ఏలో హైదరాబాద్​ సిటీ పోలీస్ కమిషనరేట్​ ఉంటుంది. టవర్​-బీలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని టెక్నాలజీస్​ ఉంటాయి. టవర్​-సీలో ఆడిటోరియం, టవర్​- డీలో మీడియా, టవర్​-ఈ అనేది కమాండ్​ కంట్రోల్​ సెంటర్​, డేటా సెంటర్​ ఉంటుంది. పర్యావరణహిత, ఐకానిక్​ భవనాన్ని రేపు ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేశాం." - సీవీ ఆనంద్​, హైదరాబాద్​ సీపీ

ABOUT THE AUTHOR

...view details