తెలంగాణ

telangana

చంద్రబాబు భద్రతపై ఎన్​ఎస్​జీ ఆరా, ఉండవల్లిలోని నివాసం పరీశీలన

By

Published : Aug 25, 2022, 8:18 PM IST

NSG inspected CBN house తెదేపా కేంద్ర కార్యాలయాన్ని ఎన్‌ఎస్‌జీ ఐజీ పరిశీలించారు. చంద్రబాబు పర్యటనల్లో గొడవలు జరగటంపై దృష్టి సారించిన ఎన్‌ఎస్‌జీ.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని సైతం పరిశీలించింది. తన పర్యటనలో దాడులపై తెదేపా నేతలు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పరిశీలనకు వచ్చినట్లు తెదేపా వర్గాలు తెలిపాయి.

చంద్రబాబు భద్రతపై ఎన్​ఎస్​జీ ఆరా
చంద్రబాబు భద్రతపై ఎన్​ఎస్​జీ ఆరా

NSG inspected CBN house: ఏపీలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​ను ఎన్​ఎస్​జీ (నేషనల్​ సెక్యూరిటీ గార్డ్​​) బృందం పరిశీలించింది. దిల్లీ నుంచి వచ్చిన ఐజీ సిమిర్దీప్ సింగ్ నేతృత్వంలోని బృందం.. పార్టీ కార్యాలయంతో పాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని భద్రతా కోణాల్లో అన్ని గదులను పరిశీలించారు.

ఇటీవల చంద్రబాబు పర్యటనల్లో తరుచూ గొడవలు జరుగుతుండటం, చంద్రబాబు నివాసం, పార్టీ కార్యాలయంపై దాడి వంటివి పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు భద్రతపై ఎన్​ఎస్​జీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల నిర్లక్ష్యం, చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెదేపా ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుల మేరకు కేంద్రం ప్రత్యేకంగా పరిశీలనకు పంపినట్లు తెదేపా వర్గాలు వెల్లడించాయి.

దాడులను పరిగణనలోకి తీసుకోవడం అభినందనీయం:చంద్రబాబు భద్రతపై కేంద్రానికి శ్రద్ధ ఉండటం అభినందనీయమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయని, వీటిని ఎన్ఎస్‌జీ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో భద్రతా వైఫ్యల్యంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మేం కేంద్రం దృష్టికి తీసుకెళ్లక ముందే ఎన్ఎస్‌జీ చొరవ తీసుకుందని తెలిపారు. తెదేపా క్యాడర్​ను తట్టుకునే శక్తి వైకాపాకు లేదని అశోక్‌బాబు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details