తెలంగాణ

telangana

నేడు రాష్ట్రానికి నితిన్​ గడ్కరీ.. 258 కిమీ రహదారుల విస్తరణకు శంకుస్థాపన

By

Published : Apr 29, 2022, 4:33 AM IST

Central Minister Nithin Gadkari: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన 12 జాతీయ రహదారులకు కేంద్ర రోడ్డు రవాణశాఖమంత్రి నితిన్ గడ్కరీ నేడు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.

Nitin Gadkari laid the foundation stone for expansion of 258 km of roads in telangana today
Nitin Gadkari laid the foundation stone for expansion of 258 km of roads in telangana today

Central Minister Nithin Gadkari: రాష్ట్రంలో 7 వేల 853కోట్ల వ్యయంతో చేపట్టిన... 12 జాతీయ రహదారులకు కేంద్ర రోడ్డు రవాణశాఖమంత్రి నితిన్ గడ్కరీ నేడు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ఉదయం పదిన్నరకు శంషాబాద్‌లోని జీఎంఆర్​ ఎరీనా వద్ద కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి 4 వేల 927కోట్ల వ్యయంతో చేపట్టనున్న.. 258 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.

ఇప్పటికే 2 వేల 926కోట్లతో సిద్ధమైన 96 కిలోమీటర్ల రహదారులను..గడ్కరీ ప్రారంభిస్తారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 10 వేల 57కోట్ల వ్యయంతో...12 వందల 78 కిలోమీటర్ల రహదారులను విస్తరించినట్లు కేంద్రం తెలిపింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details