తెలంగాణ

telangana

పది, ఇంటర్​ పరీక్షలు రద్దు కోరుతూ.. అమిత్​ షాకు లోకేశ్​ లేఖ

By

Published : May 25, 2021, 5:34 PM IST

జూన్​ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై.. జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, మానసిక ఒత్తిడి, తల్లిదండ్రుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

nara lokesh letter to amitsha
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షాకు లోకేశ్​ లేఖ

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. దేశంలోని 14 రాష్ట్రాలతో పాటు ఐసీఎస్​ఈ, సీబీఎస్​ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయని గుర్తుచేశారు. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయన్నారు.

జూన్ 7 నుంచి వేలాది పరీక్షా కేంద్రాల్లో 6.70 లక్షల మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. 5 లక్షలకు పైగా ఇంటర్ విద్యార్థులు పరీక్షల పట్ల అనిశ్చితిని ఎదుర్కొంటున్నారన్నారు.

గతేడాది నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేరని లోకేశ్‌ స్పష్టం చేశారు. సరైన ప్రత్యామ్నాయాలు లేకుండా పరీక్షలు పెడితే.. విద్యార్థులు సూపర్‌స్ప్రెడర్​లుగా మారే అవకాశముందన్నారు. ఆన్​లైన్​ ద్వారా తాము నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 5 లక్షల మంది పరీక్షల రద్దుకు మద్దతు పలికారని చెప్పారు. పరీక్షలు వద్దంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు అభ్యర్థనలను గౌరవించాలని కోరారు.

ఇవీచూడండి:విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి వచ్చిన మంటలు

ABOUT THE AUTHOR

...view details