తెలంగాణ

telangana

ఏపీ: వైభవంగా శ్రీవారి ముత్యపుపందిరి వాహనసేవ

By

Published : Oct 18, 2020, 10:56 PM IST

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.

muthyala-pandiri-vahana-seva-for-tirumala-srivaru-over-tirumala-navaratri-brahmotsavalu-2020
ఏపీ: వైభవంగా శ్రీవారి ముత్యపుపందిరి వాహనసేవ

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై అమ్మవార్లతో కలసి స్వామివారు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారు రుక్మిణి స‌త్య‌భామ స‌మేత మురళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

కల్యాణ మండపంలో కొలువుతీర్చిన వాహన సేవలో అర్చకులు నక్షత్ర, పూర్ణకుంభ హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఏపీ: వైభవంగా శ్రీవారి ముత్యపుపందిరి వాహనసేవ

ఇదీ చదవండి..నిండుకుండలా నిజాంసాగర్ జలాశయం.. పోటెత్తిన పర్యాటకులు

ABOUT THE AUTHOR

...view details