తెలంగాణ

telangana

నాపై నిఘా పెట్టారు.. అరెస్ట్ చేసేందుకు పోలీసులను..: ఎంపీ రఘురామ

By

Published : Feb 27, 2022, 7:03 PM IST

MP raghu rama comments on AP GOVT : వైకాపా ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. అధికార బలంతో ప్రతివారినీ దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మరోసారి తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

MP raghu rama comments on AP GOVT, rrr comments
నాపై నిఘా పెట్టారు.. అరెస్ట్ చేసేందుకు పోలీసులను..: ఎంపీ రఘురామ

MP raghu rama comments on AP GOVT : వైకాపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన తనపై .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిఘా పెట్టించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. మరోసారి తనను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద మఫ్టీలో పోలీసులను పెట్టారన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా "భీమ్లానాయక్‌"ను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ప్రతి వారిని అధికారం బలంతో దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన.... తగిన సమయంలో గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు.

'వైకాపా అక్రమాలను ప్రశ్నించిన నాపై సీఎం నిఘా పెట్టించారు. మరోసారి నన్ను అరెస్టు చేసేందుకు జగన్‌ యత్నించారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా భీమ్లానాయక్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. ప్రతి వారినీ దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు.'

ABOUT THE AUTHOR

...view details