ETV Bharat / state

మీకు కారు కావాలా.. అయితే బిర్యానీ తినండి..!

author img

By

Published : Feb 27, 2022, 5:07 PM IST

Sainma Restaurant bumper offer : 'మీకు కారు కొనుక్కోవాలని ఉందా..? చాలాకాలం నుంచి ఇందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం మా హోటల్​లో బిర్యానీ తింటే సరి..! మా రెస్టారెంట్​లో బిర్యానీ ఆర్డర్ చేస్తే చాలు... లక్ ఉంటే... ఆ లక్కీ డ్రాలో విన్నర్ మీరే కావచ్చు... ఓ ఖరీదైన కారును సొంతం చేసుకోవచ్చు' అంటున్నారు నిర్వాహకులు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే...?

Sainma Restaurant bumper offer, lucky draw
మీకు కారు కావాలా.. అయితే బిర్యానీ తినండి..!

Sainma Restaurant bumper offer : హైదరాబాద్ కొంపల్లికి చెందిన సైన్మా రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రెస్టారెంట్​లో బిర్యానీ తీసుకెళ్తే ఓ లక్కీ విన్నర్ కారును గెలుచుకోవచ్చునని ప్రకటించింది. రెస్టారెంట్​లో బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉందని మేనేజర్ అశోక్ తెలిపారు. ఉగాది కానుకగా ఈ సరికొత్త లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Sainma Restaurant bumper offer, lucky draw
మీకు కారు కావాలా.. అయితే బిర్యానీ తినండి..!

తమదైన స్టయిల్​లో పబ్లిసిటీ..

గత మూడేళ్ల క్రితం సందీప్ రెడ్డి, అక్షయ్ రెడ్డి కలిసి... ఈ సైన్మా రెస్టారెంట్​ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్​కు కొంపల్లి పరిసరాల్లో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పాత సినిమా పాటలు, పోస్టర్లు, పాత రేడియోలను అలంకరించి... కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ సారి కారును బంపర్ ఆఫర్​గా ప్రకటించి... తమదైన రీతిలో పబ్లిసిటీ చేస్తున్నారు.

లక్కీ డ్రాలో హ్యుండాయ్ వెన్యూ..

కస్టమర్ల ఆదరణ లభించడంతో వినియోగదారుల కోసం ఏదైనా కొత్తగా చేయాలని భావించిన యాజమాన్యం... ఉగాది సందర్భంగా ఓ హ్యుండాయ్ వెన్యూ కారును లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతిగా ఇవ్వనున్నట్లు హోటల్ నిర్వాహకులు ప్రకటించారు. తమ రెస్టారెంట్​లో బిర్యానీ తీసుకెళ్లిన వారికి... ఓ కూపన్ ఇస్తారని తెలిపారు. బిర్యానీ తీసుకెళ్లిన వారి పేరు, ఫోన్ నంబర్ రాసి బాక్సులో వేస్తే ఏప్రిల్ 2న ఉగాది రోజున డ్రా తీసి కారును అందించనున్నట్లు వివరించారు. లక్ ఉన్నవాళ్లు... ఆ కారును సొంతం చేసుకోవచ్చునని చెబుతున్నారు.

ఇదీ చదవండి: Alcohol consumption effects on health : సరదాగా మొదలై.. వ్యసనమై వేధిస్తుంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.