తెలంగాణ

telangana

mlc kadiyam Srihari comments : 'ప్రగతి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమేనా..?'

By

Published : Dec 28, 2021, 3:32 PM IST

mlc kadiyam Srihari comments : కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శలు చేశారు. ఏడేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయకపోగా.. ప్రభుత్వ సంస్థలన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు. బడా వ్యాపారుల కొమ్ముకాయటం తప్ప.. బీదలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

mlc kadiyam Srihari comments on central government for development in India under bjp
mlc kadiyam Srihari comments on central government for development in India under bjp

'ప్రగతి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమేనా..?'

mlc kadiyam Srihari comments : ఏడేళ్లలో కేంద్రంలోని భాజపా ఏం అభివృద్ధి సాధించిందలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బ్యాంకులను నాశనం చేశారని ఆరోపించారు. ప్రగతి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమేనా అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి బడా వ్యాపారులు తీసుకున్న రుణాలను మాఫీ చేశారని పేర్కొన్నారు. కనీసం విభజన హామీలు కూడా నెరవేర్చలేకపోయినా రాష్ట్ర భాజపా నేతలు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో అర్థం కావడం లేదని కడియం దుయ్యబట్టారు.

ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు..

"కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఏడేళ్లుగా ఏం సాధించింది. ఎక్కడికక్కడా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బ్యాంకులను నాశనం చేశారు. బ్యాంకుల నుంచి బడా వ్యాపారులు అడ్డగోలుగా తీసుకున్న రుణాలను మాఫీ చేశారు. ఇప్పటికే రూ.15 లక్షల కోట్లకుపైగా రుణాలను మాఫీ చేశారు. మరో రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయబోతున్నారు. భాజపా దృష్టిలో ప్రగతి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమేనా?. ఏం చూసుకుని రాష్ట్ర భాజపా నేతలు ఎగిరెగిరి వడుతున్నారో అర్థకావటంలేదు. కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. కనీసం విభజన హామీలు కూడా నెరవేర్చలేకపోయారు. " -కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details