తెలంగాణ

telangana

సెప్టెంబర్​లో చేప, రొయ్య పిల్లల పంపిణీకి సర్కారు కసరత్తు

By

Published : Aug 24, 2022, 8:12 AM IST

Fish Distribution in telangana ప్రతి సంవత్సరంలాగే ఈసారి సైతం చేపల,రొయ్యల ఉచిత పంపిణీని చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​ తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో పిల్లల పంపిణీ ఉంటుందని అన్నారు. ప్రతి జిల్లాలో జరిగే ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీల సభ్యులు పాల్గొనాలని స్పష్టం చేశారు.

distribution for fish,prawn fry
చేప, రొయ్య పిల్లల పంపిణీ

Fish Distribution in telangana : సెప్టెంబరు మొదటి వారంలో చేప, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం రోజున మత్స్యశాఖ కార్యాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని మంత్రి అన్నారు.

రాష్ట్రంలో వర్షాలు బాగా పడడం వల్ల ఈ సంవత్సరం రూ.88.53 కోట్లు ఖర్చుచేసి 68 కోట్ల చేప పిల్లలను కొనుగోలు చేశామని తెలిపారు. అలాగే రూ.24.50 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను కొన్నామని ఆయన చెప్పారు. ఈ రెండింటిని కలిపి ఒకేసారి అందజేయాలని నిర్ణయించామన్నారు. వీటిని సెప్టెంబరు మొదటి వారంలోగా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పిల్లలను తిరస్కరించాలని కోరారు. అయితే కారణాలను కమిషనర్‌ కార్యాలయానికి నివేదించాలని చెప్పారు. చేప పిల్లల విడుదల కార్యక్రమాల్లో ప్రతీ జిల్లాలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీల సభ్యులను భాగస్వాములను చేయాలని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details