తెలంగాణ

telangana

Minister Perni nani: ఒకే రాష్ట్రంగా కలిసుందాం.. ఏపీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

By

Published : Oct 28, 2021, 4:29 PM IST

"రెండు తెలుగు రాష్ట్రాలనూ కలిపేద్దాం.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయండి" అని ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఏపీ మంత్రి పేర్నినాని సూచించారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా ఏపీలో పోటీ చేయొచ్చన్నారు. ఏపీ, తెలంగాణ ఒకే రాష్ట్రంగా ఉండాలని గతంలోనే ఏపీ సీఎం జగన్(cm jagan) సూచించారని మంత్రి తెలిపారు.

minister-perni-nani-said-that-they-want-to-put-kcr-party-in-the-state
minister-perni-nani-said-that-they-want-to-put-kcr-party-in-the-state

'ఒకే రాష్ట్రంగా కలిసుందాం.. అసెంబ్లీలో తీర్మానం చేయండి'

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపేద్దామని.. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం చేయాలని ఏపీ మంత్రి పేర్ని నాని సూచించారు. ఏపీలో కొత్తగా పార్టీ పెట్టాల్సిన పనేముందన్న ఆయన.. రెండు రాష్ట్రాలూ కలిసిపోతే.. భేషుగ్గా పోటీ చేయొచ్చన్నారు. ఏపీ, తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండాలని సీఎం జగన్(cm jagan) గతంలోనే కోరుకున్నారని మంత్రి తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిపేస్తే మంచిదేనని నాని అన్నారు.

ఎయిడెడ్ విద్యా సంస్థల గురించి మాట్లాడుతూ.. ఎలాంటి బలవంతమూ లేదని మరోమారు ప్రభుత్వం స్పష్టం చేసిందని మంత్రి తెలిపారు. ఐచ్చికంగానే వారే తమ నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఏపీలో గంజాయి(cannbis) గురించి కేబినెట్​లో చర్చించామని... 2017లోనే అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్(pawan kalyan) కూడా 2018లోనే గంజాయి సాగవుతోందని ట్వీట్ చేశారన్నారు. అప్పట్లో ప్రోత్సహించనందుకే... ఇప్పుడు తమ ప్రభుత్వం పట్టుకోవటానికి ఇబ్బందులు పడుతోందన్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details