తెలంగాణ

telangana

ప్రపంచానికే ఆదర్శంగా మన దేశం కొనసాగాలన్న మంత్రి కేటీఆర్‌

By

Published : Aug 14, 2022, 6:50 PM IST

KTR in Azadi ka Amrit Mahotsav Program సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ సైనికులు రెండు రోజుల పాటు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి.. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలి నొప్పితో బాధపడుతున్న కేటీఆర్.. 3 వారాల అనంతరం ఈ కార్యక్రమానికి హాజరై సుమారు గంటన్నర పాటు గడిపారు.

Minister KTR Particiapted in Azadi ka Amrit Mahotsav Program
Minister KTR Particiapted in Azadi ka Amrit Mahotsav Program

ప్రపంచానికే ఆదర్శంగా మన దేశం కొనసాగాలన్న మంత్రి కేటీఆర్‌

KTR in Azadi ka Amrit Mahotsav Program: అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన భారత్.. రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు దిక్సూచిగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ సైనికులు రెండు రోజుల పాటు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి.. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలి నొప్పితో బాధపడుతున్న కేటీఆర్.. 3 వారాల అనంతరం ఈ కార్యక్రమానికి హాజరై సుమారు గంటన్నర పాటు గడిపారు. దేశభక్తి గీతాలకు సైనిక బృందాల నృత్యాలు, సాంస్కృతిక వేడుకలను వీక్షించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అమరులైన సైనిక కుటుంబాలకు మహావీర్ పురస్కారాలు అందజేసి గౌరవించారు. దేశ, రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. ప్రపంచ దేశాలతో భారత్​ను పోల్చలేమని గొప్ప దేశమంటూ కొనియాడారు.

"ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. కాలిగాయం వల్ల 3 వారాలుగా ఇంట్లోనే ఉన్నాను. 3 వారాల తర్వాత నేను పాల్గొన్న తొలి కార్యక్రమం ఇది. భారతదేశం విశిష్టమైనది, భారత్‌ను మరే దేశంతో పోల్చలేం. చైనాతో అనేక విషయాల్లో పోటీ పడుతున్నప్పటికీ మన ప్రత్యేకతలు వేరు. ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి కనిపిస్తోంది. ప్రపంచానికే ఆదర్శంగా మన దేశం కొనసాగాలి." - కేటీఆర్​, మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details