ETV Bharat / international

చర్చిలో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి

author img

By

Published : Aug 14, 2022, 4:22 PM IST

Updated : Aug 14, 2022, 4:42 PM IST

Cairo church fire accident
చర్చిలో భారీ అగ్నిప్రమాదం

16:19 August 14

చర్చిలో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి

Cairo church fire accident : చర్చిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన.
ఆదివారం అబు సెఫీన్​ చర్చిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్​ కారణంగానే ఇలా జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చర్చిలో అగ్నిప్రమాదంపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్​ సిస్సీ విచారం వ్యక్తం చేశారు. కోప్టిక్ క్రిస్టియన్ పోప్ తవాడ్రోస్​-2కు ఫోన్ చేసి, సంతాపం తెలియచేశారు.

Last Updated : Aug 14, 2022, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.