తెలంగాణ

telangana

KADAPA FLOODS EFFECT: ఆపద్బాంధవుడు చెన్నకేశవ కుటుంబాన్ని ఆదుకునేదెవరు?

By

Published : Nov 28, 2021, 5:17 PM IST

floods effect: వరదలో కొట్టుకుపోతున్న ఎంతో మందిని కాపాడాడు. అందరూ చూస్తుండగానే వరద ఉద్ధృతిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన చెన్నకేశవ కుటుంబ సభ్యుల కన్నీటి వ్యథ మీకోసం...!

KADAPA FLOODS EFFECT: ఆపద్బాంధవుడు చెన్నకేశవ కుటుంబాన్ని ఆదుకునేదెవరు?
KADAPA FLOODS EFFECT: ఆపద్బాంధవుడు చెన్నకేశవ కుటుంబాన్ని ఆదుకునేదెవరు?

KADAPA FLOODS EFFECT: ఆపద్బాంధవుడు చెన్నకేశవ కుటుంబాన్ని ఆదుకునేదెవరు?

KADAPA FLOODS AFFECTED PEOPLE: నది ఉప్పొంగింది... వరద ఉగ్రరూపం(heavy floods in kadapa) దాల్చి ఊరిలోకి వచ్చేసింది. చూస్తుండగానే ఇళ్లలోకి వచ్చిపడింది. అందరూ ప్రాణాలు అరచేతి పట్టుకొని పరుగులు తీశారు. అతడు మాత్రం తనకు ఏమైనా ఫర్వాలేదు అనుకున్నాడు. ఏడుగురు కుటుంబ సభ్యులను ఒంటిచేత్తో కాపాడాడు. తనతో పాటు తన వాళ్లు క్షేమంగా ఉన్నారని అంతటితో ఆగిపోలేదు. ఇరుగు పొరుగు వారందరినీ రక్షించాడు.

మరో వ్యక్తిని కాపాడే క్రమంలో వరద ఉద్ధృతిలో చిక్కుకుపోయి.. మృత్యు ఒడికి చేరాడు. అతడే ఏపీలోని కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తారుకు చెందిన చెన్నకేశవ. శనివారం ఈటీవి-భారత్ అతడి కుటుంబాన్ని పలకరించగా... వారం క్రితం అంతులేని విషాదాన్ని మిగిల్చిన కన్నీటి వరద వ్యథను చెప్పి కన్నీరుమున్నీరయ్యారు అతడి కుటుంబ సభ్యులు. అదేంటో మీరూ చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details