తెలంగాణ

telangana

ఎల్​ఆర్​ఎస్​ స్కీమ్ ప్రజల పాలిట శాపం : కోదండరాం

By

Published : Sep 14, 2020, 9:52 PM IST

భూ క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించాయి. రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనలో పాల్గొని తెజస అధ్యక్షుడు కోదండరాం సంఘీభావం ప్రకటించారు.

ఎల్​ఆర్​ఎస్​ స్కీమ్ ప్రజల పాలిట శాపం : కోదండరాం
ఎల్​ఆర్​ఎస్​ స్కీమ్ ప్రజల పాలిట శాపం : కోదండరాం

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఎల్​ఆర్​ఎస్​కు వ్యతిరేకంగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ధర్నా చేపట్టాయి. నిరసన కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు.

అయోమయంలో పడ్డారు..

ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ విధానం ప్రజల పాలిట శాపంగా మారిందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్​ సర్కార్ అనాలోచిత విధానాల వల్ల బదుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి శివారు ప్రాంతంలో ప్లాట్ కొనుగోలు చేసిన అమాయకులు అయోమయంలో పడ్డారని కోదండరాం అన్నారు. అంతకుముందు బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ధర్నాలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలి: నంది రామయ్య

ABOUT THE AUTHOR

...view details