తెలంగాణ

telangana

'అసని' ఎఫెక్ట్​: రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా

By

Published : May 10, 2022, 9:51 PM IST

inter-exam-postponed-due-to-asani-cyclone
inter-exam-postponed-due-to-asani-cyclone

21:35 May 10

'అసని' ఎఫెక్ట్​: రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా

అసని తుపాను ప్రభావం ఇంటర్ పరీక్షలపై పడింది. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేశారు. తుపాను వల్ల ఇంటర్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ఇదీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details