తెలంగాణ

telangana

వ్యవసాయానికి దక్కని "నిధుల" సాయం..

By

Published : Dec 15, 2019, 4:57 AM IST

Updated : Dec 15, 2019, 8:22 AM IST

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన లబ్ధిదారులకు సాయం అందడంలో జాప్యమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా మొత్తం రైతులందరికీ పీఎం కిసాన్‌ నిధులు వస్తాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది.

help-for-agriculture-dot
help-for-agriculture-dot

వ్యవసాయానికి దక్కని "నిధుల" సాయం..
తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబరు నుంచి నెలాఖరులోగా 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2 వేల చొప్పున కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జమ చేయాలి. కానీ నేటికీ 22 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే వేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. మిగిలిన 14 లక్షల మందిలో 6 లక్షల మంది రైతుల పేర్లు, బ్యాంకు ఖాతాల వివరాల్లో తప్పులు ఉన్నందున సరిచేస్తున్నారు. కొద్దిరోజుల్లో వాటిని సరిచేసి కేంద్రానికి పంపేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

నేరుగా రైతు ఖాతలో సొమ్ము

ఈ నెలాఖరులోగా మిగిలిన రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ప్రతి నాలుగు నెలలకు 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో కేంద్రం ఈ పథకం కింద జమ చేస్తోంది. గత జులై నుంచి ఆ పథకం పరిధిలోకి భూ యజమానులంతా రావడంతో అర్హుల సంఖ్య 36 లక్షలకు చేరింది.

వివరాలు సక్రమంగా ఉంటేనే
"ప్రతీ రైతు పేరు, ఆధార్‌ సంఖ్య, బ్యాంకు ఖాతా వివరాలన్నీ వ్యవసాయ శాఖ సక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే సొమ్ము పడుతోంది. ఈ నమోదులో జాప్యం వల్లనే ఆలస్యమవుతోంది"

వచ్చే నెల నుంచి ఐదో విడత

రైతుల వివరాలు సక్రమంగా ఉన్న జిల్లాల్లో ఎక్కువ మందికి త్వరగా సొమ్ము జమ అవుతోంది. దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 2 కోట్ల 12 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే వేశామని.. ఇంకా దాదాపు 10 కోట్ల మందికి వేయాల్సి ఉందని అంచనా. వచ్చే నెల నుంచి ఐదో విడత జమ ప్రారంభంకానుంది. కేంద్రనిధులు సత్వరం విడుదలచేస్తేనే ఇది సాధ్యమవుతుంది.

కుటుంబంలో ఒకరికి మాత్రమే

"ఒక్క కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం కింద ఏడాదికి 6 వేలు 3 విడతల్లో కేంద్రం జమ చేస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరుతో ఎక్కువ విస్తీర్ణంలో భూమిఉంటే... ఆ రైతు పేరిట బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది"

ఇవీ చూడండి: 'ఉరిశిక్షలు, ఎన్​కౌంటర్లు తాత్కాలిక ఉపశమనాలే...'

Intro:Body:Conclusion:
Last Updated :Dec 15, 2019, 8:22 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details