తెలంగాణ

telangana

LIVE UPDATES : బలపడుతోన్న ఉపరితల ఆవర్తనం.. పలు జిల్లాల్లో భారీ వర్షం

By

Published : Sep 28, 2021, 7:07 AM IST

Updated : Sep 28, 2021, 12:43 PM IST

తెలంగాణపై గులాబ్ ప్రభావం
తెలంగాణపై గులాబ్ ప్రభావం

12:41 September 28

  • విదర్భ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం

మరో 6 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం

ఈ నెల 30న గుజరాత్ తీరంలో అల్పపీడనం బలపడే అవకాశం

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం

బంగాల్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం

అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం

రాగల 24 గంటల్లో ఆవర్తనం మరింత బలపడే అవకాశం

ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

రేపు, ఎల్లుండి పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

ఇవాళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

10:48 September 28

  • జంట జలాశయాలకు వరద, మూసీలోకి నీటి విడుదల

భారీ వర్షాలతో హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద

హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,200 క్యూసెక్కులు

హిమాయత్‌సాగర్ 6 గేట్లు ఎత్తి మూసీలోకి నీటి విడుదల

ఉస్మాన్‌సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2 వేల క్యూసెక్కులు

ఉస్మాన్‌సాగర్ 4 గేట్లు ఎత్తి మూసీలోకి నీటి విడుదల

10:33 September 28

  • రంగారెడ్డి: గగన్‌పహాడ్‌లోని అప్పచెరువుకు మరోసారి గండి

అప్పచెరువుకు గండితో రహదారిపై ప్రవహిస్తున్న నీరు

గగన్‌పహాడ్ వద్ద శంషాబాద్ రహదారిపై పారుతున్న నీరు

హైదరాబాద్- బెంగళూరు జాతీయరహదారిపై ప్రవహిస్తున్న నీరు

శంషాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు దారి మళ్లింపు

ఓఆర్‌ఆర్‌ మీదుగా విమానాశ్రయానికి వెళ్లాలని సూచన

శంషాబాద్-హైదరాబాద్‌ మార్గంలో యథాతథంగా రాకపోకలు

భారీ వర్షాలకు నిండి పొంగి పొర్లుతున్న జల్‌పల్లి పెద్దచెరువు

రంగారెడ్డి: జల్‌పల్లి కార్గో రహదారిపై ప్రవహిస్తున్న వరద

కాటేదాన్‌ పారిశ్రామికవాడలో సబ్‌స్టేషన్‌లోకి చేరిన వరద నీరు

09:56 September 28

  • నల్గొండ: మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్గొండ: మూసీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5,738 క్యూసెక్కులు

నల్గొండ: మూసీ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 10,380 క్యూసెక్కులు

మూసీ ప్రాజెక్టు 6 గేట్ల ఎత్తి దిగువకు నీటి విడుదల

మూసీ ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 4.46 టీఎంసీలు

మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 3.219 టీఎంసీలు

09:21 September 28

  • నిర్మల్: భైంసా గడ్డెన్న జలాశయానికి కొనసాగుతున్న వరద

భైంసా గడ్డెన్న జలాశయం ఇన్‌ఫ్లో 31,920 క్యూసెక్కులు

గడ్డెన్న జలాశయం 3 గేట్లు ఎత్తి 39,726 క్యూసెక్కుల విడుదల

గడ్డెన్న జలాశయం గరిష్ఠ నీటిమట్టం 358.7 అడుగులు

గడ్డెన్న జలాశయం ప్రస్తుత నీటిమట్టం 358.7అడుగులు

09:14 September 28

  • భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరిలో 5,29,800 క్యూసెక్కుల ప్రవాహం

భద్రాచలం వద్ద గోదావరిలో 32.90 అడుగులకు చేరిన నీటిమట్టం

09:04 September 28

  • సిరిసిల్లలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

నిన్న కురిసిన వర్షానికి అతలాకుతలమైన కార్మిక క్షేత్రం

సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారిపై వరద ప్రవాహం

సిరిసిల్ల-కరీంనగర్ రహదారిలో రాకపోకలకు అంతరాయం

09:01 September 28

  • మేడ్చల్: నిండు కుండలా శామీర్‌పేట్ పెద్దచెరువు

మేడ్చల్: నిండు కుండలా శామీర్‌పేట్ పెద్దచెరువు

11 ఏళ్ల తర్వాత అలుగు పారుతున్న శామీర్‌పేట్ పెద్దచెరువు

08:43 September 28

  • రంగారెడ్డి: అప్పా చెరువు నిండి పొంగిపొర్లుతున్న అలుగు

హైదరాబాద్- బెంగళూరు జాతీయరహదారిపై వరద

రంగారెడ్డి: గగన్‌పహాడ్ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వరద

శంషాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు దారి మళ్లింపు

ఓఆర్‌ఆర్‌ మీదుగా విమానాశ్రయానికి వెళ్లాలని అధికారుల సూచన

శంషాబాద్-హైదరాబాద్‌ మార్గంలో యథాతథంగా రాకపోకల

08:32 September 28

  • రంగారెడ్డి: అప్పా చెరువు నిండి పొంగిపొర్లుతున్న భారీ వరద

హైదరాబాద్- బెంగళూరు జాతీయరహదారిపై వరద

రాజేంద్రనాగర్: గగన్‌పహాడ్ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు

శంషాబాద్‌ వైపు వెళ్లే వాహనాల దారిమళ్లింపు

ఓఆర్‌ఆర్‌ మీదుగా విమానాశ్రయానికి వెళ్లాలని అధికారుల సూచన

శంషాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే దారిలోనే వాహనాలకు అనుమతి


 

08:32 September 28

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద

శ్రీరాంసాగర్‌ ఇన్‌ఫ్లో 2.8లక్షల క్యూసెక్కులు

శ్రీరాంసాగర్ ఔట్‌ఫ్లో 3.46 లక్షల క్యూసెక్కులు

శ్రీరాంసాగర్ 33 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1089.3అడుగులు

శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు

శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటినిల్వ 81.117 టీఎంసీలు

శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు

08:29 September 28

  • కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద
    నిజాంసాగర్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
    నిజాంసాగర్ ఇన్ ఫ్లో 52,800 క్యుసెక్కులు
    నిజాంసాగర్ ఔట్‌ఫ్లో 72,200 క్యుసెక్కులు
    నిజాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1403.5 అడుగులు
    నిజాంసాగర్ పూర్తి నీటిమట్టం 1405 అడుగులు
    నిజాంసాగర్ ప్రస్తుత నీటినిల్వ 15.667 టీఎంసీలు
    నిజాంసాగర్ ప్రస్తుత నీటినిల్వ 17.8 టీఎంసీలు

08:26 September 28

  • నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్ 2 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల

నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 60,573 క్యూసెక్కులు

నాగార్జునసాగర్‌ ఔట్‌ఫ్లో 54,644 క్యూసెక్కులు

నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు

నాగార్జునసాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 589.5 అడుగులు

నాగార్జునసాగర్ గరిష్ఠ నీటినిల్వ 312.0405 టీఎంసీలు

నాగార్జునసాగర్ ప్రస్తుత నీటినిల్వ 310.55 టీఎంసీలు

08:22 September 28

  • నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పల వద్ద వరద ఉద్ధృతి
    వరద నీటిలో చిక్కుకున్న సిలిండర్ల వాహనం
    డ్రైవర్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన పోలీసులు, స్థానికులు

08:19 September 28

  • నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి చేరిన వరద నీరు

తుంపల్లి వద్ద తెగిపోయిన కప్పలవాగు వంతెన

వంతెన తెగిపోవడంతో నిలిచిన రాకపోకలు

కొండూరు వద్ద నూతనంగా నిర్మించిన చెక్‌డ్యాంకు గండి

ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి వద్ద వాగు ఉద్ధృతి

ఎల్లారెడ్డిపల్లి వద్ద 10 ఎకరాల్లో నీటమునిగిన పంట పొలాలు

సిరికొండ మండలం న్యావానంది వద్ద వంతెనపై వరద ప్రవాహం

జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి వద్ద కోతకు గురైన రహదారి

నారాయణపల్లిలో కూలిన హనుమాన్ ఆలయం ప్రహరీ

07:54 September 28

  • నేడు రాష్ట్రవ్యాప్తంగాప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు నేడు సెలవు

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

భారీ వర్షాల దృష్ట్యా నేడు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

విద్యాసంస్థలకు సెలవుతో ఇవాళ, రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా

సెలవు నుంచి అత్యవసర శాఖలకు మినహాయింపు

సెలవు నుంచి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలకు మినహాయింపు

సెలవు నుంచి పంచాయతీరాజ్‌ శాఖకు మినహాయింపు

సెలవు నుంచి పురపాలక శాఖకు మినహాయింపు

సెలవు నుంచి నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖలకు మినహాయింపు

శాఖల అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండాలని ఆదేశాలు

07:43 September 28

  • నిర్మల్: కడెం జలాశయానికి వరద ప్రవాహం

కడెం జలాశయం ఇన్‌ఫ్లో 72,151 క్యూసెక్కులు

కడెం జలాశయం ఔట్‌ఫ్లో 72,469 క్యూసెక్కులు

కడెం జలాశయం 6 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

కడెం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 700 అడుగులు

కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 697.8 అడుగులు

కడెం జలాశయం గరిష్ఠ నీటినిల్వ 7.603 టీఎంసీలు

కడెం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 7.039 టీఎంసీలు

07:26 September 28

  • గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు

నిన్న రా.8.30 గంటల నుంచి ఉ.6 గంటల వరకు నమోదైన వర్షపాతం

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో 22.7 సెం.మీ. వర్షపాతం

నిజామాబాద్ జిల్లా సిరికొండలో 20.9 సెం.మీ. వర్షపాతం

నిజామాబాద్ జిల్లా గన్నారంలో 19.4 సెం.మీ. వర్షపాతం

రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 19.3 సెం.మీ. వర్షపాతం

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 19.3 సెం.మీ. వర్షపాతం

రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లెలో 18.6 సెం.మీ. వర్షపాతం

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 18 సెం.మీ. వర్షపాతం

నిజామాబాద్ జిల్లా బోధన్ మం. కల్‌దుర్కిలో 17.7 సెం.మీ. వర్షపాతం

నిజామాబాద్ జిల్లా మదన్‌పల్లెలో 17.4 సెం.మీ. వర్షపాతం

భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 17.2 సెం.మీ. వర్షపాతం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మం. మగిడిలో 17 సెం.మీ. వర్షపాతం

నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో 17 సెం.మీ. వర్షపాతం

నిజామాబాద్ జిల్లా మల్కాపూర్‌లో 16.6 సెం.మీ. వర్షపాతం

ఆర్మూర్ మండలం ఆలూరులో 15.8 సెం.మీ. వర్షపాతం


 

07:24 September 28

  • మూడు రోజులు శాసనసభ, మండలి సమావేశాలకు విరామం

తిరిగి అక్టోబర్ 1న సమావేశం కానున్న ఉభయసభలు

గులాబ్ తుపాను, భారీ వర్షాల దృష్ట్యా సమావేశాలకు విరామం

ఎమ్మెల్యేలు సహాయచర్యల్లో పాల్గొనాల్సినందున నిర్ణయం

వర్షాకాల సమావేశాలపై నిర్ణయం తీసుకున్న సభాపతి, ప్రొటెం ఛైర్మన్

సభా నాయకుడు, ఆయా పక్షనేతలను సంప్రదించి నిర్ణయం

సభ్యుల విజ్ఞప్తి మేరకు సభాపతి, ప్రొటెం ఛైర్మన్ నిర్ణయం 

07:21 September 28

  • కమిషనరేట్‌ పరిధిలో సిబ్బందిని అప్రమత్తం చేశాం: సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు: సీపీ

సైబరాబాద్‌లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు: సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

సహాయక చర్యలకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు: సీపీ

24 గంటలు కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారు: సీపీ

లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు క్విక్‌ యాక్షన్‌ టీమ్స్‌: సీపీ

విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు: సీపీ

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 9490617100, 8331013206: సీపీ

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 040-278534183, 27853412: సీపీ

విద్యుత్‌ సమస్యలపై టోల్‌ఫ్రీ నంబర్‌ 1912: సీపీ

సహాయం కోసం డయల్ 100 కి కాల్ చేయవచ్చు: సీపీ

07:11 September 28

  • వర్షాల దృష్ట్యా ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సమీక్ష

స్కాడాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్: సీఎండీ రఘుమారెడ్డి

విద్యుత్‌ సమస్యలపై 1912, 100 ప్రత్యేక నంబర్లు: సీఎండీ

విద్యుత్‌ సమస్యలపై ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు: రఘుమారెడ్డి

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 7382072104, 7382072106: సీఎండీ

కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 7382071574: సీఎండీ రఘుమారెడ్డి

07:10 September 28

  • వికారాబాద్: పులుసుమామిడి వాగులో వ్యక్తి గల్లంతు

వాగు దాటుతుండగా బైక్‌ సహా వ్యక్తి గల్లంతు

అధికారులు హెచ్చరిస్తున్నా వాగు దాటేందుకు యత్నించిన వ్యక్తి

అధికారులు రక్షించే యత్నం చేసినా వాగులో గల్లంతైన వ్యక్తి

గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న అధికారులు, పోలీసులు

07:07 September 28

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం 

ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు నేడు సెలవు

భారీ వర్షాల దృష్ట్యా నేడు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

సెలవు నుంచి అత్యవసర శాఖలకు మినహాయింపు

సెలవు నుంచి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలకు మినహాయింపు

సెలవు నుంచి పంచాయతీరాజ్‌ శాఖకు మినహాయింపు

సెలవు నుంచి పురపాలక శాఖకు మినహాయింపు

సెలవు నుంచి నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖలకు మినహాయింపు

శాఖల అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండాలని ఆదేశాలు

06:39 September 28

LIVE UPDATES : గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కుంభవృష్టి

రాష్ట్రంలో పలు జిల్లాలను వణికించిన గులాబ్ తుపాను

నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా వర్షం

అధిక వర్షాలతో పలు ప్రాంతాల్లో నీటమునిగిన కాలనీలు, రోడ్లు

రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిండిన చెరువులు, కుంటలు

భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

ఎడతెరిపిలేని వర్షంతో తడిసి ముద్దయిన హైదరాబాద్‌

నిన్న సాయంత్రం హైదరాబాద్‌ నగరంలో కుండపోత వాన

నగరంలో నీటమునిగిన వందలాది కాలనీలు

హైదరాబాద్‌ నగరంలో ఉప్పొంగిన నాలాలు, కాల్వలు

ఇళ్లలోకి నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవస్థలు

నగరంలో పలుచోట్ల రహదారులపై మోకాల్లోతు చేరిన నీరు

గ్రేటర్‌లో 42 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ

నేడూ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Last Updated :Sep 28, 2021, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details