తెలంగాణ

telangana

ap rain news: పొంగి పొర్లుతున్న వాగులు... తృటిలో తప్పిన ప్రమాదం

By

Published : Nov 19, 2021, 2:35 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని (ap rain news) లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి(rain alert news) పొర్లుతున్నాయి. సోమశిల జలాశయానికి (somasila project) అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. పంబలేరు కాలువ దాటుతున్న విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది.

ap rain news
ap rain news

ఏపీలోని నెల్లూరు(rains in nellore)జిల్లాలో గల స్వర్ణముఖి నది (swarnamukhi river) ప్రవాహం ఉద్ధృతంగా మారింది. నాయుడుపేట నుంచి వెంకటగిరి వెళ్లే నది వంతెనపై మూడు నాలుగు అడుగుల మేర నీరు పారుతోంది. మేనకూరు సెజ్‌లోని కంపెనీల ఉద్యోగులు, కార్మిక సిబ్బంది బస్సులు ఈ మార్గంలో పోవడం లేదు. స్వర్ణముఖి నది ప్రవాహంతో పెళ్లకూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గల వ్యవసాయ పొలాలు కోతకు గురవుతున్నాయి. రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పెళ్లకూరు మండలం పుల్లూరు ముమ్మారెడ్డిగుంట మధ్య నీటి పారుదల పెరిగి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో ప్రమాదకరంగా దాటారు.

పొంగి పొర్లుతున్న వాగులు..

గూడూరు రూరల్(rains in ap) సర్కిల్ పరిధిలోని చిల్లకూరు, మనుబోలు, సైదాపురం, గూడూరు ప్రాంతాల్లో అధికారులు... పోలీసులను (police alert) అప్రమత్తం చేశారు. ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామ మహిళా పోలీసుల సేవలు కూడా వినియోగించుకుంటున్నారు. సైదాపురం మండలం పొదలకూరు మార్గంలోని మాలేరు వాగు, పిన్నేరు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మనుబోలు మండల పరిధిలోని పంబలేరు, చల్లకాలువ వాగులు సైతం ఉధృతంగా పారుతున్నాయి. వెంకటగిరిలో రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కైవల్యా నది పరవళ్లు తొక్కుతుంది. వెంకటగిరి కాశీ విశ్వనాథ స్వామి ఆలయం దగ్గర నది ప్రవాహం కొనసాగుతూ ఉంది. బాలాయపల్లి మండలం నిండలి దగ్గరి కాజ్వేపై కైవల్యా పొంగి పోర్లుతుండటంతో నిన్నట్నుంచి ఈ మార్గంలో రాకపోకలు కొనసాగడం లేదు.

తృటిలో తప్పిన ప్రమాదం..

భారీ వర్షానికి గుడూరులోని పంబలేరు కాలువ పొంగిపొర్లుతోంది. వరదనీటిలో కాలువ దాటుతుండగా ఆదిశంకర ఇంజినీరింగ్ విద్యార్థులు జారి పడ్డారు. తృటిలో ప్రమాదం తప్పింది. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో విద్యార్థులు తిరిగి వెనక్కి వెళ్లారు. వెంకటగిరిలోను భారీ వర్షాలు కురిశాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం

నిండుకుండలా సోమశిల..

సోమశిల జలాశయానికి (somasila project) అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 3 లక్షల 62 వేల 466 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3 లక్షల 50 వేల 450 క్యూసెక్కులు. దీంతో జలాశయం 12 గేట్లు ఎత్తి పెన్నానదికి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమశిల జలాశయం పూర్తి నీటిమట్టం 77.988 టీఎంసీలు (TMC) కాగా.. ప్రస్తుత నీటిమట్టం 71 వేల 75 టీఎంసీలుగా నమోదయ్యింది. పెన్నా నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు సోమశిల జలాశయం పరిస్థితిని కలెక్టర్​కు వివరించారు.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

ఇదీ చదవండి:భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం- పాఠశాలలు బంద్​!

ABOUT THE AUTHOR

...view details