తెలంగాణ

telangana

Corona Vaccination In Telangana: తెలంగాణలో 100 శాతం మందికి కరోనా టీకా తొలిడోస్​ పూర్తి!

By

Published : Dec 24, 2021, 5:27 AM IST

Corona Vaccination In Telangana: తెలంగాణలో టీకా తీసుకొనేందుకు అర్హులైన వారిలో 100 శాతం మందికి కరోనా టీకా తొలిడోస్​ పూర్తిచేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. అత్యధికంగా రంగారెడ్డిలో 113 % వాక్సినేషన్ పూర్తి అయిందని చెప్పారు.

CORONA VACCINATION IN TELANGANA
CORONA VACCINATION IN TELANGANA

Corona Vaccination In Telangana: రాష్ట్రంలో టార్గెటెడ్ జనాభాలో 100 శాతం మందికి కొవిడ్ టీకా తొలిడోస్​ పూర్తయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. హైటెక్స్​లో జరిగిన క్రెడాయ్ సమావేశంలో పాల్గొన్న ఆయన... ఈ మేరకు ప్రకటించారు. తెలంగాణలో 2.77 కోట్ల మంది 18 ఏళ్లు పూర్తిచేసుకొని.. కొవిడ్​ టీకా తీసుకొనేందుకు అర్హులు కాగా.. 100 శాతం మందికి తొలిడోస్​ వ్యాక్సినేషన్​ పూర్తయినట్లు చెప్పారు. 61 శాతం మందికి రెండో డోస్​ పూర్తియినట్లు చెప్పారు.

కరోనా వ్యాక్సినేషన్​లో తెలంగాణ ఆదర్శంగా ఉందని మంత్రి హరీశ్​రావు చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డిలో 113 % వాక్సినేషన్ పూర్తి అయిందని మంత్రి చెప్పారు. తర్వాత స్థానాల్లో 110 శాతంతో హైదరాబాద్, 104 శాతంతో మెదక్ జిల్లాలు ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కువగా నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో.. ఇతర ప్రాంతాల నుంచి రంగారెడ్డికి వచ్చిన వారికీ ఇక్కడే కరోనా టీకాలు వేసినట్లు చెప్పారు. అందువల్లనే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా టీకా పంపిణీ జరిగినట్లు చెప్పారు.

Corona Vaccination In Telangana: తెలంగాణలో 100 శాతం మందికి కరోనా టీకా తొలిడోస్​ పూర్తి!

ఇదీచూడండి:మహమ్మారిపై యుద్ధం ఇంకా ముగియలేదు: మోదీ

ABOUT THE AUTHOR

...view details