తెలంగాణ

telangana

భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు

By

Published : Aug 14, 2021, 11:43 AM IST

బంగారం ధర శనివారం భారీగా పెరిగింది. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించి రూ. 65 వేల పైకి చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold and silver prices
gold and silver prices

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.583 మేర పెరిగింది. కేజీ వెండి రూ.1,300 లాభపడింది.

తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

  • హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,851కి చేరింది.
  • ఈ నగరాల్లో కేజీ వెండి ధర రూ.65,350గా ఉంది.
  • స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1779 డాలర్లుగా నమోదైంది.
  • స్పాట్ సిల్వర్ ధర 23.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఏపీ, తెలంగాణలో ఇంధన ధరలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.98.01 వద్ద ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.108.06గా ఉంది.
  • వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.

ఇదీ చూడండి: ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? ఈ విషయాలు తెలుసుకోండి..

ABOUT THE AUTHOR

...view details