తెలంగాణ

telangana

Godavari flood: లంక గ్రామాలపై గోదావరి పంజా

By

Published : Sep 15, 2022, 3:53 PM IST

Godavari flood: గోదావరి వరదలు ఆంధ్రప్రదేశ్​ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సీజన్‌లో గోదావరికి మూడోసారి వరద ఉప్పొంగడంతో... లంక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా శివారు కూనవరం మరోసారి వరద గుప్పిట్లోకి చేరింది. నాలుగోసారి గోదావరికి వరద వచ్చి.. అష్టకష్టాలు పడుతున్నారు.

Godavari flood
Godavari flood

లంక గ్రామాలపై గోదావరి పంజా

Godavari flood: గోదావరి వరదలు కోనసీమలోని లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సీజన్‌లో గోదావరికి మూడోసారి వరద ఉప్పొంగడంతో.. లంక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఏనుగుపల్లి గ్రామాన్ని వరద చుట్టుముట్టడంతో.. ప్రజలు బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. అల్లూరి సీతారామరాజు జిల్లా శివారు కూనవరం మండలం కూడా.. మరోసారి వరద గుప్పిట్లోకి చేరింది. ప్రభుత్వం నుంచి సాయం అందక.. అక్కడి ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. నాలుగోసారి గోదావరికి వరద వచ్చి.. అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యావసరాలు అందక.. ఆకలి తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. పోలవరం పునరావాసం ప్యాకేజీ ఇస్తే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతామని కోరుతున్నారు.

కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో లంక భూములు వరదకోతకు గురవుతున్నాయి. ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల పరిధిలో సుమారు 27 లంక గ్రామాలు ఉన్నాయి. ఈ సీజన్లో మూడోసారి గౌతమి గోదావరి, వృద్ధ గౌతమి గోదావరి నదికి వరద పోటెత్తింది. పరివాహక లంకలను ముంచెత్తింది. ఇళ్లల్లోకి నీరు చేరింది. సారవంతమైన లంక భూములూగోదావరిలో కలిసిపోతున్నాయి. వరదలు వచ్చిన ప్రతీసారీ ఉప్పు,పప్పులతో సరిపెడుతున్న ప్రభుత్వం.. గోదాట్లో కలుస్తున్న పొలాలకు పరిహారం ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. తాతల తరంలో ఉన్న ఎకరాలు.. మనవళ్ల చేతికి వచ్చేసరికి సెంటు కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక భూములను నదీ కోత నుంచి రక్షించాలని కోరుతున్నారు.

గోదావరి వరదలతో లంకవాసులకు మరోసారి జలజీవనం తప్పలేదు. కొనసీమజిల్లా సఖినేటిపల్లి మండలంలోని అప్పనరామునిలంక, కొత్తలంక, టెకిశెట్టిపాలెం, మలికిపురం మండలంలోని దిండి, రామరాజులంక బడవ, మామిడికుదురు మండలంలోని.. అప్పనపల్లి, పెదపట్నంలంకలు జలదిగ్బంధం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల నీటిలో రాకపోకలకు జనం ఇబ్బంది పడుతున్నారు. వరదప్రవాహం ఎక్కువగా ఉండటంతో సఖినేటిపల్లి- నర్సాపురం, సోంపల్లి- అబ్బిరాజపాలెం మార్గాల్లో పంటు సేవలు నిలిపివేశారు. గోదావరికి ఈ ఏడాది మూడోసారి వరద పోటెత్తింది.

ABOUT THE AUTHOR

...view details