తెలంగాణ

telangana

జీహెచ్​ఎంసీ జరిమానా విధించడం సరైందే: మేయర్ విజయలక్ష్మి

By

Published : Feb 13, 2021, 4:46 PM IST

నూతన మేయర్​ గద్వాల విజయలక్ష్మికి అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినవారిపై జీహెచ్​ఎంసీ తీసుకున్న చర్యలను... ఆమె సమర్థించారు. మనం రూపొందించుకున్న నిబంధనలు మనం తప్పకుండా పాటించాల్సిందేనని పేర్కొన్నారు.

జీహెచ్​ఎంసీ జరిమానా విధించడం సరైందే: మేయర్ విజయలక్ష్మి
జీహెచ్​ఎంసీ జరిమానా విధించడం సరైందే: మేయర్ విజయలక్ష్మి

తన మీద అభిమానంతో నిబంధనలు ఉల్లంఘిస్తు ఫ్లెక్సీ పెట్టిన వారికి జీహెచ్ఎంసీ జరిమానా వేయడాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వాగతించారు. చట్టం ముందు అందరూ సమానమేనని వెల్లడించారు.

మనమే నిబంధనలు రూపొందించుకున్నందున... ప్రజలతో పాటు అందరం కచ్చితంగా పాటించాలని కోరారు. దీంతో నగర సుందరీకరణతో పాటు అభివృద్ధికి సహకరించినవాళ్లం అవుతామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ట్విట్టర్​ ప్రశ్నకు ఫ్లెక్సీలు ఊడిపోయాయి..!

ABOUT THE AUTHOR

...view details