తెలంగాణ

telangana

SRISAILAM DAM: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

By

Published : Jul 2, 2021, 12:21 PM IST

శ్రీశైలం జలాశయం(SRISAILAM DAM) కళకళలాడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 6,328 క్యూసెక్కుల నీటి ప్రవాహం జలాశయంలోనికి వచ్చి చేరుతోంది.

Srisailam, Srisailam Dam, Srisailam Reservoir, Srisailam Dam flooded
శ్రీశైలం, శ్రీశైలం డ్యాం, శ్రీశైలం జలాశయం, శ్రీశైలం డ్యామ్​కు వరద

శ్రీశైలం జలాశయానికి(SRISAILAM DAM) వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 6,328 క్యూసెక్కుల నీటి ప్రవాహం జలాశయంలోనికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 822.30 అడుగులు ఉంది.

గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 42.6064 టీఎంసీలు ఉంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఎడమ గట్టు జల విద్యుత్కేంద్రంలో 14.376 మి.యూ. విద్యుత్​ ఉత్పత్తి చేశారు. విద్యుదుత్పత్తి చేసి 35,315 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details