తెలంగాణ

telangana

చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు: వెంకయ్యనాయుడు

By

Published : Sep 9, 2022, 3:59 PM IST

FRIENDLY MEETING AT GUNTUR: చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చట్టసభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. ఏపీలోని గుంటూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన ఆయన.. భాష హుందాతనంగా ఉండాలన్నారు. మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మాతృభాషలో చదివిన చాలామంది అత్యున్నత స్థానాలకు ఎదిగారని గుర్తు చేశారు.

venkaiah naidu
venkaiah naidu

FRIENDLY MEETING AT GUNTUR: పదవిలో ఉన్నవారు తమ భాష, ప్రవర్తనతో చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థ పరిధులేమిటో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో ఏం జరుగుతోందని ప్రపంచమంతా ఎదురు చూస్తోందని.. అందుకే చట్టసభల్లో మాట్లాడే భాష.. సభ్యత, సంస్కారంతో ఉండాలని స్పష్టం చేశారు.

చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు: వెంకయ్యనాయుడు

రాజ్యాంగ పదవుల కంటే జనం మధ్యలో ఉండి పని చేయటం అంటేనే ఇష్టం. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిలో సుభాష్ చంద్రబోస్ కూడా ముఖ్యులు. ఆయనతో పాటు చాలామందికి దక్కాల్సిన గుర్తింపు రాలేదు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా అలాంటి వారిని స్మరించుకోవటం గర్వకారణం. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉన్నత స్థాయికి వస్తారనే అభిప్రాయం తప్పని.. మాతృభాషలో చదివిన చాలా మంది దేశంలో అత్యున్నత స్థానాలకు ఎదిగారు.ఇంట్లో, గుడిలో, బడిలో మాతృభాషలోనే మాట్లాడాలని, పరిపాలన కూడా తెలుగులో జరగాలి -వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్​లు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందినవారు, నగర ప్రముఖులు పలువురు వెంకయ్యను కలిశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details