తెలంగాణ

telangana

మూడు గదుల్లో 600 మందికి విద్యాబోధన

By

Published : Aug 2, 2019, 8:47 PM IST

సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలోని ప్రభుత్వ జూనియర్​, డిగ్రీ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. షిఫ్ట్​ల ద్వారా కళాశాల నిర్వహించడం వల్ల తరగతులు కోల్పోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.

college students protest demanding new buildings for their college

మూడు గదుల్లో 600 మందికి విద్యాబోధన

సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలోని ప్రభుత్వ జూనియర్​, డిగ్రీ కళాశాలలకు వేర్వేరు భవనాలు లేకపోవడం వల్ల షిఫ్ట్​ విధానం ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల తాము తరగతులు నష్టపోతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్​ పద్మారావుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గదుల్లో 600 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి, వెంటనే నూతన భవనాలు నిర్మించాలని లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వంశీ..సికింద్రాబాద్.7032401099 సికింద్రాబాద్ యాంకర్..సీతాఫల్మండి లోని ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థులు నిరసన చేపట్టారు...షిఫ్ట్ విధానం ద్వారా కళాశాలను నడపడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు..ఉదయం పూట డిగ్రీ కళాశాలకు మధ్యాహ్నం పూట జూనియర్ కళాశాల నిర్వహించడం వల్ల విద్యార్థులు తరగతులు కోల్పోతున్నారని పేర్కొన్నారు..విద్యాశాఖ అధికారులకు మరియు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మా రావు కు ఎన్ని సార్లు తమ సమస్య విన్నవించుకున్నా అప్పటికి ఆయన పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు..ఇప్పటికే 27 కోట్లు కళాశాల కోసం మంజూరు చేసినప్పటికీ విద్యాశాఖ మరియు రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతో నిర్మాణానికి నోచుకోలేదన్నారు..కళాశాల భవనం నిర్మాణం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు..విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు..విద్యార్థులు మాట్లాడుతూ కేవలం తమకు మూడో తరగతి గదులు మాత్రమే ఉన్నాయని అందులో 600 మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించడం పట్ల తమకు ఇబ్బందిగా ఉందని తెలిపారు..కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు తగినంతగా లేరని సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు అని అన్నారు ..సరైన మరుగుదొడ్లు తాగునీటి సౌకర్యం కూడా లేవని అన్నారు..ఒకే తరగతి గదిలో అన్ని గ్రూపుల వారిని కూర్చోబెట్టి చెబుతున్నారని అన్నారు ల్యాబ్ లో కంప్యూటర్ లో ఎలాంటివి లేవని వాపోయారు..తమకు సత్వరమే కళాశాల నూతన భవనాన్ని కేటాయించాలని కోరారు..సరైన అధ్యాపకులు లేక తమ విద్యా కుంటుపడుతుందని పరీక్షలు కూడా త్వరలోనే రాబోతున్నాయని తాము ఏ విధంగా పరీక్షలకు హాజరు కావాలని అర్థం కావట్లేదని విద్యార్థులు తెలిపారు..బైట్ 1.రాజేష్ విద్యార్థి సంఘం నాయకుడు 2.సాయిచరణ్ కళాశాల విద్యార్థి 3.విరాజిత కళాశాల విద్యార్థిని

ABOUT THE AUTHOR

...view details