తెలంగాణ

telangana

'తెలంగాణలా దేశం మారాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.. తప్పా..'

By

Published : Feb 13, 2022, 7:15 PM IST

Updated : Feb 13, 2022, 9:00 PM IST

CM KCR ABOUT NEW CONSTITUTION IN INDIA
CM KCR ABOUT NEW CONSTITUTION IN INDIA

18:48 February 13

'దేశమంతా దళితబంధు పెట్టడం కోసం రాజ్యాంగం మార్చమంటున్నా.. తప్పా..'

'తెలంగాణలా దేశం మారాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.. తప్పా..'

CM KCR about New Constitution: దళితుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని చెబుతున్నా అని సీఎం కేసీఆర్​ ఉద్ఘాటించారు. ప్రగతిభవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్​.. కొత్త రాజ్యాంగ ఆవశ్యకతను వివరించారు. రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలని అంబేడ్కరే చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అందరికీ సమాన హక్కుల కోసం కొత్త రాజ్యాంగం కావాలని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. తెలంగాణ లాగా దేశం మారాలని కొత్త రాజ్యాంగం రావాలంటున్నానని ఉద్వేగపూరితంగా వివరించారు.

కొత్త రాజ్యాంగం కావాలనడం తప్పా...

"దళితుల రిజర్వేషన్లు 19 శాతానికి పెంచాలని రాజ్యాంగం మార్చమంటున్నా. పురుషులతో సమానంగా మహిళకు ఆస్తిలో హక్కు ఇచ్చేందుకు రాజ్యాంగం కావాలంటున్నా. కేంద్రం రాష్ట్రాల హక్కులన్నింటి హరిస్తోంది. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోయి.. పటిష్ట రాజ్యాంగం కావాలంటున్నా. దేశమంతా దళిత బంధు పెట్టడం కోసం రాజ్యాంగం మార్చమంటున్నా. బీసీలు కులగణన కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా. వాళ్ల హక్కులు కావాలంటున్నారు. ఇప్పుడున్న రాజ్యాంగం ఇవ్వట్లేదు. కొత్త రాజ్యాంగంలో పొందుపర్చాలంటున్నా. దేశవ్యాప్తంగా ఎస్టీ సబ్​ప్లాన్​ అమలుచేసేందుకు కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.. తప్పా.. రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలని అంబేడ్కరే చెప్పారు. తన స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. గుజరాత్‌లో దళిత బిడ్డలను చంపేస్తున్నారు. గుజరాత్‌లో దళిత బిడ్డల ఊరేగింపులను సహించలేకపోతున్నారు. వాళ్లకు రక్షణ కల్పించేందుకు కొత్త రాజ్యాంగం కావాలంటున్న తప్పా. అందరికీ సమాన హక్కుల కోసం కొత్త రాజ్యాంగం కావాలి. 77 శాతం సంపద 10 శాతం మంది దగ్గర ఉండొద్దు. 77 శాతం సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కావాలి. అమెరికా కంటే గొప్పగా ఎదిగేందుకు కావాల్సిన వనరులు, వసతులు, యువత ఈ దేశంలో ఉంది. ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతివైపు భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్న తప్పా. తెలంగాణలాగా భారతదేశం పరివర్తన చెందాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్న తప్పా."- సీఎం కేసీఆర్​

ఇవీ చూడండి:

Last Updated : Feb 13, 2022, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details