తెలంగాణ

telangana

Cm Jagan Review On Floods: 'నిత్యావసరాలు అందించిన కుటుంబాలకు రూ.2 వేలు ఇవ్వండి'

By

Published : Nov 29, 2021, 7:00 PM IST

Cm Jagan Review On Floods: వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైన వారికి.. కొత్త ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. నిత్యావసరాలు ఇచ్చిన ప్రతి ఇంటికీ రూ.2 వేలు అందించాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలపై కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కలెక్టర్లతో సమీక్షించారు.

CM JAGAN REVIEW ON FLOODS
ap cm jagan

Cm Jagan Review On Floods: వరద ప్రాంతాల్లో సహాయ చర్యలపై నాలుగు జిల్లాలో కలెక్టర్లతో సీఎం జగన్​ సమీక్ష నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సహాయ చర్యలు, పరిహారం వివరాలను సీఎం జగన్​కు.. కలెక్టర్​ వివరించారు. పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ తర్వాత సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాలని జగన్​ ఆదేశించారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైన వారికి.. కొత్త ఇళ్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల పనులు వెంటనే మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వారికి రూ.2 వేలు ఇవ్వండి..

చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. చెరువుల మధ్య అనుసంధానం ఉండేలా చూడాలన్నారు. చెరువులు నిండితే ఆ నీరు కాల్వలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో తాగునీటి పునరుద్ధరణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నిత్యావసరాలు ఇచ్చిన ప్రతి ఇంటికీ రూ.2 వేలు అందించాలన్నారు. ఆర్‌బీకేల ద్వారా విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశామని సీఎం జగన్‌ తెలిపారు.

ఆ విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించాలి..

Cm Jagan On Annamayya project: అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడిందని, అలాగే చాలా చోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకూ గండ్లు పడ్డాయన్నారు. వీటిమీద ఆధారపడ్డ పట్టణాల్లో, గ్రామాల్లో తాగునీటికి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయాలు చూడాలని సూచించారు. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి అదనపు సహాయం 2 వేలు అందించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చే విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించాలని సీఎం జగన్​ అన్నారు.

ఇదీచూడండి:cabinet sub committee on Corona: ఒమిక్రాన్​పై ప్రభుత్వం అప్రమత్తం.. మంత్రివర్గ ఉపసంఘం నియామకం

ABOUT THE AUTHOR

...view details