తెలంగాణ

telangana

ఇంటర్ విద్యార్థికి శుభాశీస్సులు తెలుపుతూ... సీజేఐ లేఖ

By

Published : Jun 8, 2021, 10:45 PM IST

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Nv Ramana) విజయవాడ విద్యార్థికి శుభాశీస్సులు తెలుపుతూ లేఖ రాశారు. విద్యాభ్యాసం నిరాఘాటంగా కొనసాగిస్తూ, ఎంచుకున్న రంగంలో కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

justice nv ramana
justice nv ramana letter to inter student

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. విజయవాడ విద్యార్థికి శుభాశీస్సులు తెలుపుతూ లేఖ రాశారు. సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిరోహించినందుకు అభినందనలు తెలుపుతూ... నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థి పొట్లూరి దర్శిత్.. సీజేఐకు స్వదస్తూరితో తెలుగులో రెండు పేజీల లేఖ రాశాడు.

దీనికి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యుత్తరం పంపారు. "చక్కటి తెలుగులో రాసిన లేఖ నాకు అపరిమితమైన ఆనందాన్ని కలిగించింది. విద్యాభ్యాసం నిరాఘాటంగా కొనసాగిస్తూ, ఎంచుకున్న రంగంలో కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షిస్తున్నా." అని లేఖలో పేర్కొన్నారు.

ఇదీచూడండి:ఐదో తరగతి విద్యార్థి లేఖకు సీజేఐ ఫిదా

ABOUT THE AUTHOR

...view details