తెలంగాణ

telangana

CJI Tirumala Tour: రేపు శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ దంపతులు

By

Published : Mar 5, 2022, 7:53 PM IST

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారిని ఆదివారం దర్శించుకోనున్నారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీజేఐకి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఘన స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలో బస చేసి... రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.

CJI Tirumala Tour:
CJI Tirumala Tour:

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు తిరుమల చేరుకున్నారు. తితిదే ఛైర్మన్, వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ఆయన స్వాగతం పలికారు. అంతకు ముందు అలిపిరిలో సప్త గో ప్రదక్షిణశాలను సీజేఐ ఎన్వీ రమణ సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి గో ప్రదక్షిణ శాలలో పూజలు చేశారు. గో తులాభారంలో మొక్కలు చెల్లించుకున్నారు. వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రేపు (ఆదివారం) సీజేఐ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీజేఐకి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

ఇదీ చదవండి :ఉపాధ్యాయుడిపై మూడో తరగతి పిల్లాడి ఫిర్యాదు.. ఎందుకో తెలుసా...?

ABOUT THE AUTHOR

...view details