తెలంగాణ

telangana

CBN: నాన్న తాగితేనే.. "అమ్మ ఒడి" ఇస్తామనడం దుర్మార్గం: చంద్రబాబు

By

Published : Nov 25, 2021, 4:14 PM IST

chandrababu fire on ycp govt: తాగిన డబ్బులతో ఇచ్చే సంక్షేమ పథకాలు ఎవరడిగారు? అని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదల రక్తంతో ఇచ్చే సంక్షేమ పథకాలు అవసరమా? అని ప్రశ్నించారు.

CBN: నాన్న తాగితేనే.. "అమ్మ ఒడి" ఇస్తామనడం దుర్మార్గం: చంద్రబాబు
CBN: నాన్న తాగితేనే.. "అమ్మ ఒడి" ఇస్తామనడం దుర్మార్గం: చంద్రబాబు

cbn nellore tour: ఏపీలోని నెల్లూరు జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెళ్లకూరు, నాయుడుపేట, గూడూరు, వెంకటాచలం వద్ద ఆగి శ్రేణులతో కాసేపు మాట్లాడారు. మద్యపాన నిషేధమని చెప్పిన సీఎం జగన్.. తాగిన డబ్బుతో వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఇవ్వటమేంటని ప్రశ్నించారు.

నాన్న తాగితే పిల్లలకు అమ్మఒడి, మీరు తాగితే మీ పిల్లలకి చదువు అని కొత్త కొత్త స్కీములు పెట్టే విచిత్రమైన మనిషి జగన్(babu fire on jagan) అని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో కొత్త కష్టాలు ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావాలన్నారు. పేదవాడి రక్తాన్ని తాగే జలగ వైకాపా అని ధ్వజమెత్తారు. తాను ప్రజల కోసం ఉన్నానని.. బెదిరింపులకు భయపడబోనని తేల్చిచెప్పారు.

"నాన్న తాగితేనే అమ్మ ఒడి ఇస్తాననడం దుర్మార్గం. తాగిన డబ్బుతో ఇచ్చే సంక్షేమ పథకాలు ఎవరడిగారు. పేదల రక్తంతో ఇచ్చే సంక్షేమ పథకాలు మనకు అవసరమా ? కొత్త స్కీములు పెట్టే విచిత్రమైన మనిషి జగన్‌ రెడ్డి. నేను ప్రజల కోసమే ఉన్నా.. బెదిరింపులకు భయపడను." -చంద్రబాబు, తెదేపా అధినేత

CBN: నాన్న తాగితేనే.. "అమ్మ ఒడి" ఇస్తామనడం దుర్మార్గం: చంద్రబాబు

ఇదీ చదవండి

Ganja seized in Hyderabad today : హైదరాబాద్​లో రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details