తెలంగాణ

telangana

CBN Video Conference : అరాచకాలపై రాజీలేని పోరాటం చేయాలి : చంద్రబాబు

By

Published : Jan 21, 2022, 10:55 PM IST

CBN Video Conference : ఏపీలో మండల, నియోజవర్గ స్థాయిలో పార్టీ కమిటీలు, కార్యక్రమాలపై నేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఆయన అన్నారు. స్థానిక సమస్యలపై తెలుగుదేశం స్థానిక నాయకత్వం పోరాటాలు పెంచాలని సూచించారు.

CBN
CBN

CBN Video Conference : వైకాపా పాలనతో ప్రజలు పూర్తిగా విసిగి పోయారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో నష్టపోని వర్గం అంటూ లేదని విమర్శించారు. స్థానిక సమస్యలపై తెలుగుదేశం స్థానిక నాయకత్వం పోరాటాలు పెంచాలని సూచించారు. మండల, నియోజవర్గ స్థాయిలో పార్టీ కమిటీలు, కార్యక్రమాలపై నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సమన్వయంతో కొవిడ్ బాధితులను ఆదుకోవాలని శ్రేణులకు సూచించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపాకి దారుణ ఓటమి తప్పదని పేర్కొన్నారు. పీఆర్సీ విషయంలో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగుల పోరాటాలకు తెదేపా మద్దతు ఉంటుందన్నారు. తెదేపాకి ఓటు వేశారా లేదా అనేది ఎప్పుడూ చర్చ కాదన్న చంద్రబాబు, బాధిత వర్గం ఎక్కడ ఉన్నా తెదేపా వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

క్యాసినో విష సంస్కృతిని రాష్ట్రానికి తీసుకురావటమే కాకుండా, వైకాపా నేతలు నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అరాచకాలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా దశలవారీగా పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అరెస్ట్ అయిన తెలుగుదేశం నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసుల సమక్షంలోనే పార్టీ కార్యాలయం, వాహనాలపై దాడి జరిగిందని నేతలు చంద్రబాబుకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details