ETV Bharat / state

పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లు, నాన్​కేడర్​ అధికారుల నియామకం

author img

By

Published : Jan 21, 2022, 10:11 PM IST

Additional Collectors: పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లు, నాన్​కేడర్​ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడం సహా వెయిటింగ్​లో ఉన్న వారికి పోస్టింగులు ఇచ్చింది.

పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లు, నాన్​కేడర్​ అధికారుల నియామకం
పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లు, నాన్​కేడర్​ అధికారుల నియామకం

Additional Collectors: జిల్లాలకు అదనపు కలెక్టర్లు సహా పలువురు నాన్​కేడర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడం సహా వెయిటింగ్​లో ఉన్న వారికి పోస్టింగులు ఇచ్చింది. జగిత్యాల అదనపు కలెక్టర్​గా బి.ఎస్.లత, నారాయణపేట అదనపు కలెక్టర్​గా జి.పద్మజారాణి, రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్​గా ఖీమా నాయక్​కు పోస్టింగు ఇచ్చారు. ములుగు అదనపు కలెక్టర్​గా వై.వి.గణేష్, వరంగల్ అదనపు కలెక్టర్​గా కె.శ్రీవాస్తవ, మహబూబాబాద్ అదనపు కలెక్టర్​గా ఎం.డేవిడ్​లు నియామకమయ్యారు. నాగర్​కర్నూల్ అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డిని సిద్దిపేటకు బదిలీ చేశారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్​ను కామారెడ్డి అదనపు కలెక్టర్​గా బదిలీ చేశారు. చంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా కె.అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా భూపరిరక్షణ ఎస్డీసీగా బి.సంతోషిని నియమించారు. మేడ్చల్ - మల్కాజిగిరి న్యాయాధికారిగా ఆర్.ఎస్.చంద్రావతి, మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓగా కె.వెంకట ఉపేందర్ రెడ్డికి పోస్టింగులు ఇచ్చారు. నారాయణపేట ఆర్డీఓగా పి.రామచందర్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారిగా యు. రఘురామశర్మను నియమించారు. హెచ్ఎండీఏ కార్యదర్శిగా పి.చంద్రయ్యకు పోస్టింగు ఇచ్చారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.