తెలంగాణ

telangana

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. నేడు రాష్ట్రానికి తరుణ్​ చుగ్​​

By

Published : Jun 8, 2022, 4:50 AM IST

BJP News: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2,3 తేదీల్లో జరగనున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. మరోవైపు కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేసేలా కమిటీలను ఏర్పాటు చేసేందుకు భాజపా సంస్థాగత సహ ప్రధానకార్యదర్శి శివప్రకాశ్‌, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌ నేడు హైదరాబాద్‌కు రానున్నారు.

BJP National Working Committee meeting
భాజపా మీటింగ్​

BJP Meeting:భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్‌ HICC వేదికగా జులై 2 సాయంత్రం 4గంటల నుంచి మూడో తేదీ సాయంత్రం 5గం. వరకూ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేశామా లేదా అని సమీక్షించుకోవడంతో పాటు పలు అంశాలపై కమలనాథులు తీర్మానాలు చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా భాజపా నేతలు చర్చించనున్నారు. మరోవైపు కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేసేలా కమిటీలను ఏర్పాటు చేసేందుకు భాజపా సంస్థాగత సహ ప్రధానకార్యదర్శి శివప్రకాశ్‌, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌ నేడు హైదరాబాద్‌కు రానున్నారు.

ABOUT THE AUTHOR

...view details