పార్టీ నుంచి అరెస్టుల దాకా.. జూబ్లీహిల్స్​ కేసులో మినిట్​ టు మినిట్ అప్డేట్​

author img

By

Published : Jun 7, 2022, 9:42 PM IST

Updated : Jun 7, 2022, 11:13 PM IST

Jubileehills gang rape case accused could face life imprisonment or the death penalty

21:30 June 07

బాలిక అత్యాచార వివరాలు సవివరంగా సీపీ సీవీ ఆనంద్​ మాటల్లోనే..

బాలిక అత్యాచార వివరాలు సవివరంగా సీపీ సీవీ ఆనంద్​ మాటల్లోనే..

Jubileehills gang rape case: జూబ్లీహిల్స్​ అత్యాచారం కేసులో దర్యాప్తు పూర్తయిందని సీపీ సీవీ ఆనంద్​ వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేసిన సీపీ.. లోతుగా దర్యాప్తు చేసినట్టు తెలిపారు. నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. కఠిన చట్టాలు పెట్టినందు వల్లే.. అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు చేశామన్నారు. కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని... బలమైన ఆధారాల సేకరణ వల్లే కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. కేసులో ఎవరినీ తప్పించే ప్రయత్నం జరగలేదని సీపీ స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగిందంటే..

బెంగళూరుకు చెందిన వ్యక్తి స్కూల్స్​ ప్రారంభం కంటే ముందే.. పార్టీ ఏర్పాటు చేయాలని భావించాడు. అందుకోసం హైదరాబాద్​లోని ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. వాళ్లు సర్వే చేసి అమ్మీషియా పబ్‌ బాగుంటుందని చెప్పారు. పార్టీ ఏర్పాటు విషయమై ఒక మైనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. నాన్‌ ఆల్కహాలిక్‌, నాన్‌ స్మోకింగ్‌తో పార్టీ కోసం మేజరైన మరో స్నేహితుడి ద్వారా పబ్‌ బుక్‌ చేయించారు. రూ.1200 టికెట్‌ను బేరమాడి రూ.900 ఉండేలా తగ్గించారు. మే రెండో వారంలో పార్టీ 28న నిర్వహించనున్నట్టు మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. పార్టీ కోసం టికెట్‌ రూ.900కు తగ్గించినా రూ.1200 వసూలు చేశారు. మే 25న బెంగళూరు నుంచి వచ్చి రూ.లక్ష అడ్వాన్స్‌ చెల్లించారు.

పార్టీ గురించి స్నేహితుని ద్వారా తెలుసుకున్న బాలిక.. టికెట్​ బుక్​ చేసుకుంది. మే 28న స్నేహితుడితో కలిసి మధ్యాహ్నం 1.10కు అమ్నీషియా పబ్‌కు వెళ్లింది. 1.50 వరకు కలిసి డ్యాన్స్ చేశారు. బాలికకు పబ్‌లో మరో స్నేహితురాలు కలిసింది. బాలికను పబ్‌లోనే వదిలేసి స్నేహితుడు పనిమీద వెళ్లిపోయాడు. అప్పటి నుంచి స్నేహితురాలితో ఉన్న బాలికను 3.15కి నిందితుల్లో ఒకడైన బాలుడు కలిశాడు. కాసేపటికి సాదుద్దీన్​ కూడా కలిసి బాలికను వేధించారు. 5.10 తర్వాత వేధింపులు ఎక్కువ కావడంతో ఇద్దరు అమ్మాయిలు ఇబ్బందిపడ్డారు. 5.15కి పబ్‌ నుంచి బయటికి వచ్చారు.

3 గంటలకే పబ్​కు చేరుకున్న నిందితుల​ స్నేహితులు.. అక్కడే పథకం వేసుకున్నారు. వాళ్లంతా అమ్మాయిలను అనుసరించారు. బాలికతో పాటు ఉన్న యువతి క్యాబ్‌ బుక్‌ చేసుకుని వెళ్లిపోయింది. నిందితులు బాలికకు మాయమాటలు చెప్పి ట్రాప్​ చేశారు. కాన్సూ బేకరీకి వెళ్లటం కోసమని 5.43కి బాలికతో పాటు నలుగురు నిందితులు బెంజ్​ కారులో ఎక్కారు. అదే సమయంలో సాదుద్దీన్​ సహా మరో నలుగురు నిందితులు ఇన్నోవా కారులో ఎక్కి.. బెంజ్​ కారును అనుసరించారు. బంజారాహిల్స్​లో ఉన్న బేకరీకి వెళ్తే క్రమంలో.. ఒకరి తర్వాత ఒకరు అమ్మాయికి ముద్దులు పెట్టారు. దాన్నంతా వీడియోలు తీసుకుని వాట్సప్​లలో షేర్​ చేసుకున్నారు. రెండు కార్లు సాయంత్రం 5.51కు కాన్సూ బేకరీ వద్దకు చేరుకున్నాయి. 5.54కి బాధిత బాలిక.. బెంజ్​ కారులో నుంచి దికి ఇన్నోవాలో ఎక్కింది. 5.57కి రెండు కార్లను పార్కింగ్​ ప్రాంతంలో పార్క్​ చేశారు. 6.15కు బాలికతో ఉన్న ఇన్నోవా కారు బేకరీ నుంచి వెళ్లిపోయింది.

బాలికతో పాటు ఐదుగురు మైనర్లు.. సాదుద్దీన్​ కలిసి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 6.18కి ఐదుగురు మైనర్లలో ఒకరు ఫోన్​ రావటంతో వెనక్కి వచ్చాడు. సాదుద్దీన్‌తో పాటు మరో నలుగురు మైనర్లు.. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వెనకాల నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపారు. కారులోనే ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేశారు. ఈ క్రమంలో బాలికకు మెడతో పాటు శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. అనంతరం బాలికను రాత్రి 7.31కు ఇన్నోవాలో పబ్‌ వద్ద బాలికను వదిలి వెళ్లిపోయారు. బాలిక ఫోన్‌ చేస్తే రాత్రి 7.53కు తండ్రి వచ్చి తీసుకెళ్లారు.

మే 28న ఘటన జరిగినా మే 31 వరకు బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. బాలిక మెడతో పాటు పలు చోట్ల గాయాలు గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మే 31న రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. భరోసా కేంద్రంలో నాలుగైదు గంటలపాటు బాధితురాలికి ధైర్యం చెప్పడంతో వివరాలు చెప్పింది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు సెక్షన్లు మార్చారు. అనంతరం.. నీలోఫర్‌ ఆస్పత్రిలో బాధితురాలిని చేర్పించి చికిత్స అందించారు. పబ్‌, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు వేగవంతంగా చేసి నిందితులను పట్టుకున్నారు.

"అత్యాచారం కేసులో దర్యాప్తు పూర్తి అయింది. ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారు. ఘటనలో ఏ1 సాదుద్దీన్‌ మాలిక్‌తో పాటు మరో నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నాం. అత్యాచారం కేసులో ఏ-1 సాదుద్దీన్‌ మాలిక్‌ మాత్రమే మేజర్‌. ఒక మైనర్​ పరారీలో ఉండగా.. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి పట్టుకున్నాం. నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కఠిన చట్టాలు పెట్టినందువల్లే.. అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు చేశాం. అందులో భాగంగానే నిందితుల గుర్తింపు కాస్త ఆలస్యమైంది. ఈ ఘటనలో అమాయకులను బలి చేయొద్దన్న ఉద్దేశంతో జాగ్రత్తకు తీసుకున్నాం. కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. బలమైన ఆధారాల సేకరణ వల్లే కొంత ఆలస్యమైంది. కేసులో ఎవరినీ తప్పించే ప్రయత్నం జరగలేదు." - సీవీ ఆనంద్​, హైదరాబాద్​ సీపీ

సంబంధిత కథనాలు:

Last Updated :Jun 7, 2022, 11:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.