తెలంగాణ

telangana

'కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే అర్హత లేదు'

By

Published : Oct 8, 2022, 4:58 PM IST

BJP leader Somu Veerraju: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే అర్హత లేదని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ త్వరలోనే వీఆర్‌ఎస్‌ తీసుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్​కు ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేతలను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు.

Somu Veerraju
Somu Veerraju

BJP leader Somu Veerraju: తెలంగాణ సీఎం కేసీఆర్​కు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే అర్హతే లేదని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు విమర్శించారు. కేసీఆర్​ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ... త్వరలోనే వీఆర్ఎస్ తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెడుతున్నామని చెప్పి, ఆంధ్రులను పాలేర్లుగా చిత్రీకరించిన కేసీఆర్​కు ఏపీలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదన్నారు. కుమార్తె కవిత దిల్లీలో మద్యం అమ్ముతూ పట్టుబడితే కేసీఆర్, కేటీఆర్​లకు మతిభ్రమించి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేతలపై విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.

'కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే అర్హత లేదు'

"కేసీఆర్‌ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టారు. కేసీఆర్‌కు కొత్త పార్టీ పెట్టే హక్కు లేదు. ఆంధ్రులను ద్రోహులుగా వర్ణించిన కేసీఆర్‌కు ఏపీకి వచ్చే అర్హత లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతపై కేటీఆర్‌ వ్యాఖ్యలు సరికాదు. కేసీఆర్‌ కుమార్తె కవిత దిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకుంది. తెలంగాణలో తెరాస ఓటమి ఖాయం. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌.. వీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మమకారం లేదు. రాజధానిని ఎన్నికల అంశంగా ప్రభుత్వం మారుస్తోంది." -భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

రాజధాని అమరావతి విషయంలో భాజాపాకు మరో ఆలోచనే లేదని సోమువీర్రాజు అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలన్న ఉద్దేశంతోనే కేంద్రం అన్ని విధాల అభివృద్ధి చేస్తోందన్నారు. అమరావతిపై మమకారం లేని పార్టీలు దీన్ని రాజకీయ అంశంగా రాద్దాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం... రైతులను మోసగిస్తోందని, ఇంకా బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడం దారుణమన్నారు.

సర్పంచ్​ల నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భాజపా... ఏపీ వ్యాప్తంగా ఉద్యమం చేపడుతుందని వెల్లడించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తుందని అధిష్ఠానం నిర్ణయించిన అనంతరం అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details