తెలంగాణ

telangana

వాసవి కన్​స్ట్రక్షన్​లో భారీ పేలుడు... 400 మీటర్లు ఎగిరిపడ్డ రాళ్లు

By

Published : Aug 20, 2020, 8:35 PM IST

హైదరాబాద్​ బాచుపల్లిలోని వాసవి కన్​స్ట్రక్షన్​లో భారీ పేలుడు సంభవించింది. 400 మీటర్ల దూరానికి పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరిపడ్డాయి. బస్సులు, కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది.

BIG BLAST IN VASAVI CONSTRUCTION AT BHACHUPALLY
వాసవి కన్​స్ట్రక్షన్​లో భారీ పేలుడు... 400 మీటర్లు ఎగిరిపడ్డ రాళ్లు

హైదరాబాద్​ బాచుపల్లి వీఎన్నార్ విజ్ఞాన జ్యోతి కళాశాల సమీపంలో వాసవి కన్​స్ట్రక్షన్​లో భారీ పేలుడు సంభవించింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నిర్మాణ స్థలంలో భారీ పేలుడు సంభవించడం వల్ల చుట్టుపక్కల ఉన్న చైతన్య కళాశాల, విజ్ఞాన్ జ్యోతి కళాశాలలోని 4 బస్సులు, 2 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. హాస్టల్ భవనం అద్దాలు పగిలిపోయాయి. 400 మీటర్ల దూరంలో ఉన్న ఫర్నిచర్ షాప్​లో సుమారు క్వింటాల్ బండరాయి ఎగిసిపడటం వల్ల 5 సోఫాలు తునాతునకలయ్యాయి.

కొవిడ్ కారణంగా కళాశాలలు మూసి ఉండటంతో భారీగా ప్రాణ నష్టం తప్పింది. 400 మీటర్లకు పైగా రాళ్ల ముక్కలు ఎగిసిపడ్డాయంటే ప్రమాద తీవ్రత ఎంత స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం అందించగా... ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

ABOUT THE AUTHOR

...view details