తెలంగాణ

telangana

Double Bedroom House scheme : 'డబుల్' హామీల్లో వేగం.. నిర్మాణంలో నిదానం

By

Published : Oct 2, 2021, 9:14 AM IST

రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు.. ఏళ్లుగా ఒంటి గదుల్లో.. గాలి.. వెలుతురు.. రోడ్డు సౌకర్యం లేని మురికివాడల్లో నివాసం. ఆ ఇళ్లను ఖాళీ చేస్తే ఉచితంగా రెండు పడక గదుల ఇళ్ల(Double Bedroom House scheme)ను నిర్మించి ఇస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పడంతో ఉన్నపళంగా వదిలేసి అద్దె ఇళ్లకు మారారు. అయిదేళ్లుగా కలల ఇంటి(Double Bedroom House scheme) కోసం భాగ్యనగర బస్తీ వాసులు ఎదురు చూస్తున్నా నిర్మాణాలు పూర్తి కాలేదు. అద్దెలు భరించలేక వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

డబుల్ ఇళ్ల కోసం బస్తీవాసుల ఎదురుచూపులు
డబుల్ ఇళ్ల కోసం బస్తీవాసుల ఎదురుచూపులు

హైదరాబాద్ మహానగరంలోని పేదలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్ల(Double Bedroom House scheme)ను నిర్మించి ఇవ్వాలని అయిదారేళ్ల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అపార్టుమెంట్ల రూపంలో లక్ష ఇళ్లను నిర్మించ తలపెట్టారు. మొదటి దశలో 1200 మురికివాడలను ఖాళీ చేసి వీలున్నంత మేర నిర్మించాలనుకున్నారు. 2016-17లో మురికివాడల ప్రజలతో బల్దియా అధికారులు చర్చలు జరిపారు.

40 బస్తీల్లోని ప్రజలు మాత్రమే తాముంటున్న ఇళ్లను ఖాళీ చేయడానికి అంగీకరించారు. గరిష్ఠంగా ఏడాదిన్నరలోగా కొత్త ఇళ్లు కేటాయిస్తామంటూ అప్పట్లో అధికారులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. 40 బస్తీల్లో 8898 కుటుంబాల కోసం అపార్ట్‌మెంట్ల రూపంలో రెండు పడక గదుల ఇళ్ల(Double Bedroom House scheme) నిర్మాణం ప్రారంభించారు. అయిదేళ్లయినా చాలా చోట్ల పూర్తికాలేదు. 2 వేల ఇళ్ల(Double Bedroom House scheme)ను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. కొన్ని నిర్మాణంలో ఉండడం, మరికొన్ని చోట్ల పిల్లర్ల దశలోనే పనులు నిల్చిపోవడంతో ఆయా బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జోక్యం చేసుకొని కొన్నిచోట్ల ప్రారంభింపజేశారు. బల్దియా అధికారులు నిధుల విడుదల చేయకపోవడం వల్లే పనులను నిల్పివేశామని గుత్తేదారులు చెబుతున్నారు.

ఇవీ ఉదాహరణలు

సికింద్రాబాద్‌ అడ్డగుట్ట ఆజాద్‌ చంద్రశేఖర్‌నగర్‌ బస్తీ :

2017లో ఖాళీ చేయించారు. మూడు బ్లాకులు కింద 72 ఇళ్ల(Double Bedroom House scheme) నిర్మాణం మొదలుపెట్టారు. రెండు బ్లాకుల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. మూడోది పిల్లర్లు వేసి వదిలేశారు. ఎప్పటికి పూర్తవుతాయో అధికారులే చెప్పలేకపోతున్నారు.

నాంపల్లి మురళీధర్‌భాగ్‌ బస్తీ :

2017లో ఖాళీ చేయించారు. 120 ఇళ్ల(Double Bedroom House scheme) నిర్మాణాన్ని ప్రారంభించారు. అయిదేళ్లయినా నిర్మాణం పూర్తి చేయలేదు. అద్దెలు చెల్లించలేకపోతున్నామంటూ బస్తీవాసులు ఆందోళనకు దిగారు. 2022 ప్రథమార్థంలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

మెహిదీపట్నం భోజగుట్ట మురికివాడ :

13 ఎకరాల్లో విస్తరించిన అతిపెద్ద బస్తీ. రూ.140 కోట్లతో 1824 ఇళ్లు(Double Bedroom House scheme) నిర్మించాలని తలంచారు. 2017లో ఖాళీ చేయించి నిర్మాణాలు ప్రారంభించారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి.

ఏం చేయాలో పాలుపోవడంలేదు

"అయిదేళ్ల కిందట ఇల్లు ఖాళీ చేయించారు. నిర్మాణం పూర్తి చేయలేదు. చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. సంపాదన తిండికే సరిపోవడం లేదు. అద్దెలు చెల్లించలేకపోతున్నాం."

- పుష్పమ్మ, భోజగుట్ట లబ్ధిదారు

వచ్చిందంతా అద్దెకే

"2017లో స్థలాన్ని తీసుకున్నారు. ఏడాదిలోగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఇప్పటికీ పూర్తిచేయలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. టీ బంకే ఆధారం. అధికం అద్దెకే పోతోంది."

- ఎల్లమ్మ, ఆజాద్‌ చంద్రశేఖర్‌నగర్‌ బస్తీ

వేగంగా పూర్తి చేస్తాం

"వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణం(Double Bedroom House scheme) ఆలస్యమైన విషయం వాస్తవమే. చాలా బస్తీల్లో ఇప్పటికే పూర్తి కావచ్చాయి. మిగిలిన పనులను పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకు ఇస్తాం."

- బల్దియా ఇంజినీరింగ్‌ విభాగం

ABOUT THE AUTHOR

...view details