తెలంగాణ

telangana

నిమజ్జన వేడుకల్ని అడ్డుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తాం: బండి సంజయ్‌

By

Published : Sep 5, 2022, 6:05 PM IST

Updated : Sep 5, 2022, 6:13 PM IST

Bandi Sanjay on Ganesh Immersion: శాంతి భద్రతల సమస్యలు సృష్టించి దాని ద్వారా ఒక వర్గం ఓట్లు పొందడానికి తెరాస ప్రయత్నిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిమజ్జన వేడుకలు జరపాలంటే అనుమతులు తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఈ వేడుకల్ని అడ్డుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల పాలిట 317 జీవో శాపంగా మారిందని మండిపడ్డారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay on Ganesh Immersion: నిమజ్జన వేడుకలు, హిందూ పండుగలను అడ్డుకుని.. కొన్ని మతతత్వ పార్టీలను సంతృప్తి పరచడానికి ప్రభుత్వం చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నిమజ్జన వేడుకల్ని అడ్డుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ప్రశాంతంగా జరపాలని మేము అనుకుంటుంటే.. శాంతి భద్రతల సమస్యలు సృష్టించి దాని ద్వారా ఒక వర్గం ఓట్లు పొందడానికి తెరాస ప్రయత్నిస్తుందని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

నిమజ్జనానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచర్లను అరెస్టు చేయడం సిగ్గు చేటు అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం వేశారు. అరెస్టు చేసిన టీచర్లకు వెంటనే ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

'నిమజ్జన వేడుకలు జరపాలంటే అనుమతులు తీసుకోవాలా?. ప్రభుత్వం వినాయక మండపాల సంఖ్య తగ్గించేందుకు చూస్తోంది. నిమజ్జనానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కోర్టు ఉత్తర్వులు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నిమజ్జన వేడుకల్ని అడ్డుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచర్లను అరెస్ట్ చేయడం సిగ్గు చేటు. ఉపాధ్యాయుల పాలిట 317 జీవో శాపంగా మారింది. అరెస్ట్ చేసిన టీచర్లకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

నిమజ్జన వేడుకల్ని అడ్డుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తాం: బండి సంజయ్‌

ఇవీ చదవండి:

Last Updated : Sep 5, 2022, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details