ETV Bharat / city

ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకున్న బండి సంజయ్‌

author img

By

Published : Sep 5, 2022, 2:00 PM IST

Bandi Sanjay Visit Khairatabad Ganesh: దేశం నుంచి బ్రిటిష్‌ వారిని తరిమికొ‌ట్టడానికే బాలగంగాధర్‌ తిలక్‌ ఆనాడు వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఖైరతాబాద్ భారీ గణపతిని ఆ పార్టీ జమ్ము కాశ్మీర్‌ ఇంఛార్జ్​ తరుణ్‌ చుగ్‌తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏకదంతుడికి 110 అడుగుల కండువా బహుకరించారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Visit Khairatabad Ganesh: కులాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో విడిపోయిన హిందూ సమాజాన్ని ఏకం చేయటానికే గణనాధుడి నవరాత్రులు నిర్వహించటం జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. భాజపా జమ్ము కాశ్మీర్ ఇంఛార్జ్ తరుణ్​చుగ్​తో కలిసి బండి సంజయ్ ఖైరతాబాద్ భారీ గణపతిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వారి వెంట ఉన్నారు.

ఆనాడు దేశం నుంచి బ్రిటిష్‌ వారిని తరిమికొ‌ట్టడానికే బాలగంగాధర్‌ తిలక్‌ వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని బండి సంజయ్​ అన్నారు. ఈ వేడుకల ద్వారా హిందూ సమాజం సంఘటిత శక్తి నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏకదంతుడికి 110అడుగుల కండువా, 25 కిలోల లడ్డూను భాజపా నేతలు బహుకరించారు.

ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకొన్న బండి సంజయ్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.