తెలంగాణ

telangana

Avanti Audio: ఏపీ మంత్రి అవంతి 'ఆడియో' వైరల్.. వెనుక ఉన్నదెవరు ?

By

Published : Aug 21, 2021, 11:25 AM IST

Updated : Aug 21, 2021, 11:57 AM IST

ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియోతో తనకు సంబంధం లేదని ఇప్పటికే ముత్తంశెట్టి ప్రకటించారు. అయితే గురువారం నాటి క్లిప్పింగులకు కొనసాగింపుగా ‘పార్ట్‌-2’ పేరుతో మరో ఆడియో బయటకు వచ్చింది. వైరల్‌ అవుతున్న సంభాషణల వెనుక ఉన్నదెవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రయోజనం ఆశించి వాటిని ప్రచారం చేశారు ? ఆడియోలో మాట్లాడిన గొంతులు ఎవరివనే విషయాలు చర్చకు దారితీశాయి.

avanti-audio-viral-in-social-media
Avanti Audio: మంత్రి అవంతి 'ఆడియో' వైరల్.. వెనుక ఉన్నదెవరు ?

ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) మాట్లాడినట్లుగా చెబుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న సంభాషణల వెనుక ఉన్నదెవరనేది చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రయోజనం ఆశించి వాటిని ప్రచారం చేశారు ? ఆడియోలో మాట్లాడిన గొంతులు ఎవరివనే విషయాలు చర్చకు దారితీశాయి.

తాజాగా పార్ట్‌-2 సంభాషణ

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించి మరీ...ఆ ఆడియోతో తనకు సంబంధం లేదని ప్రకటించారు. అయితే గురువారం నాటి క్లిప్పింగులకు కొనసాగింపుగా ‘పార్ట్‌-2’ పేరుతో మరో ఆడియో బయటకు వచ్చింది. అందులో మహిళ ఎవరో గుర్తించినట్లు ప్రచారం సాగింది. విషయం తెలుసుకున్న కొందరు వైకాపా నేతలు సదరు పేరు గలవారితో మాట్లాడి ఆరాతీయగా...ఆ మాటలు తనవి కావని, దాంతో తనకు సంబంధం లేదని ఆమె వివరించినట్లు తెలుస్తోంది. ఎవరో గిట్టనివాళ్లు తన పేరు ఉపయోగించి ఉండొచ్చని చెప్పినట్లు తెలుస్తోంది.

సైబర్‌ క్రైం పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. సంభాషణల ఆడియోలను సామాజిక మాధ్యమాల్లో ఎవరు పోస్ట్‌ చేశారన్న విషయం తెలిస్తే వారి నుంచి కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. పోస్ట్‌ చేసినవారి వివరాల కోసం పలు ప్రశ్నలతో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ సంస్థల ప్రతినిధులకు లేఖలు రాశారు. ఈ వ్యవహారంపై వైకాపా అధిష్ఠానం కూడా ఆరా తీసినట్లు సమాచారం.

క్రమశిక్షణతో ఎదిగా..

‘నా కర్తవ్య నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ ఉండబట్టే సామాన్యస్థాయి నుంచి మంత్రి వరకూ ఎదగగలిగాను. నా ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఎవరు, ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయాలను పోలీసులు నిగ్గుతేలుస్తారు. ఆ సంభాషణలతో నాకు సంబంధం లేనప్పుడు, నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? అందుకే నేరుగా పోలీసులకే ఫిర్యాదు చేశా.’

- ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి

ఇదీ చూడండి:ys viveka murder case : వివేకా హత్య కేసు.. సమాచారం ఇస్తే రూ.5లక్షల రివార్డు

Last Updated : Aug 21, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details