తెలంగాణ

telangana

ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు

By

Published : Jun 12, 2020, 9:52 AM IST

ఏపీ ఇంటర్​ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు వెల్లడించనున్నారు. కరోనా లాక్​డౌన్ కారణంగా సమాధాన పత్రాల మూల్యాంకనం ఆలస్యమైనా.. ఇటీవల అమలైన ఆంక్షల సడలింపులతో ప్రక్రియ పూర్తయింది. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

results
results

ఏపీ ఇంటర్‌ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

కరోనా విజృంభణ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో జవాబు పత్రాల మూల్యాంకనం ఆలస్యమైంది. అయితే.. ఇటీవల ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో మూల్యాంకనాన్ని పూర్తి చేసిన ఇంటర్‌ బోర్డు అధికారులు ఫలితాలను ఎట్టకేలకు నేడు ఫలితాలు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి.

ఇదీ చూడండి:మాజీమంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details