తెలంగాణ

telangana

తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడి అరెస్టుపై హైకోర్టు స్టే

By

Published : Jun 22, 2020, 7:09 PM IST

తెదేపా నేత అయ్యన్నపాత్రుడి అరెస్టుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తనపై నమోదైన నిర్భయ కేసును ఎత్తివేయాలంటూ పిటిషన్ వేశారు. అరెస్టును నిలుపుదల చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం... అయ్యన్న అరెస్టుపై స్టే ఇచ్చింది.

ayyannapathrudu
ayyannapathrudu

తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడి అరెస్టుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల ఆయనపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్​లో ఓ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో... ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసు ఎత్తివేయాలంటూ పిటిషన్ వేశారు. అరెస్టును నిలుపుదల చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం... అయ్యన్న అరెస్టుపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇదే కేసులో అయ్యన్నపాత్రుడిపై దాఖలైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కేసు వివరాలు

ఇటీవల అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారనే ఆరోపణలపై ఆమె చేసిన ఫిర్యాదుతో నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై పెట్టిన కేసును ఎత్తివేయాలని అయ్యన్నపాత్రుడు కోర్టును ఆశ్రయించారు. అరెస్టును నిలుపుదల చేయాలని కోరారు.

ఇదీ చదవండి:మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై 'నిర్భయ' కేసు

ABOUT THE AUTHOR

...view details