తెలంగాణ

telangana

హైదరాబాద్‌కు కన్‌ఫ్ల్యూయెంట్ మెడికల్ డివైజెస్ కంపెనీ

By

Published : Mar 24, 2022, 10:18 AM IST

KTR America Tour : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్‌తో.. కన్‌ఫ్ల్యూయెంట్ మెడికల సంస్థ డైరెక్టర్ డీన్ షావర్, ఫిష్ ఇన్ కంపెనీ ఛైర్మన్ మనీశ్ కుమార్ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆయా సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం గురించి కేటీఆర్‌తో చర్చించారు. తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఈ కంపెనీలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

KTR America Tour
KTR America Tour

KTR America Tour : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌తో ఇవాళ.. కన్‌ఫ్ల్యూయెంట్ మెడికల్ సంస్థ డైరెక్టర్, సీఈవో డీన్ షావర్ భేటీ అయ్యారు. ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్‌ఫ్ల్యూయెంట్.. హైదరాబాద్‌లో తమ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్‌కు తెలిపారు. ఏడాదిలోగా దాన్ని విస్తరిస్తామని చెప్పారు. నింతోల్ ఉత్పత్తుల తయారీ కోసం అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తున్నట్లు డీన్ షావర్ వెల్లడించారు. దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీగా కన్‌ఫ్ల్యూయెంట్‌ నిలవనున్నట్లు వివరించారు. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్ టెక్స్టైల్ సేవలకు సంబంధించి ప్రణాళికలను ప్రకటిస్తామన్నారు.

KTR US Tour : వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడంలో తెలంగాణ ఎప్పుడూ ముందే ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కన్‌ఫ్ల్యూయెంట్ సంస్థ తయారీ ప్లాంట్ యూనిట్‌కు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని కేటీఆర్ డీన్ షావర్‌కు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఆ సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని చెప్పారు.

KTR US Tour Updates : ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్ఠాత్మక కంపెనీ ఫిష్ ఇన్ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం ఫిష్ ఇన్‌ కంపెనీ ఛైర్మన్, సీఈఓ మనీశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టంని అభివృద్ధి చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఈ మేరకు కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఫిష్‌ ఇన్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details