తెలంగాణ

telangana

AP MLA SRIDEVI: ఏపీ ఎమ్మెల్యే శ్రీదేవి రాజీనామా చేయాలని రైతుల డిమాండ్

By

Published : Jul 3, 2021, 1:01 PM IST

ఏపీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని(MLA sridevi) అమరావతి రైతులు అడ్డుకున్నారు. అసైన్డ్ రైతులకు కౌలు డబ్బులు, పింఛన్‌ చెల్లించలేదంటూ నిరసన తెలిపారు.

MLA SRIDEVI, AP NEWS
ఏపీ, ఎమ్మెల్యే శ్రీదేవి

ఏపీ ఎమ్మెల్యే శ్రీదేవిని అడ్డుకున్న రైతులు

ఆంధ్రప్రదేశ్‌ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అమరావతి రైతుల(amaravati farmers) నిరసన సెగ తగిలింది. మందడంలో గ్రామ సచివాలయం ప్రారంభానికి వెళ్తున్న శ్రీదేవిని లింగాయపాలెం సమీపంలో అమరావతి దళిత ఐకాస నేతలు అడ్డుకున్నారు. అసైన్డ్ రైతులకు వైకాపా ప్రభుత్వం నుంచి ఈ ఏడాది కౌలు డబ్బులు ఇంకా రాలేదని.. పింఛన్లు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కాన్వాయ్​కి అడ్డుగా రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు(police) బలవంతంగా పక్కకు నెట్టివేశారు. ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే పోలీసులతో బల ప్రయోగం చేయించారని రైతులు వాపోయారు. అమరావతి ప్రజల సమస్యలు పరిష్కరించనప్పుడు ఆమె ఇక్కడకు రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అమరావతిలో జరిగేది ఫొటో ఉద్యమమే

ఏపీ సీఎం జగన్‌(cm jagan)తోనే రాజధాని అభివృద్ధి అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అమరావతిలో జరిగేది ఫొటో ఉద్యమమేనని విమర్శించారు. రైతులెవరూ సమస్యలపై తనను కలవలేదని.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే ఏపీ రాజధానిలో అభివృద్ధి(development) పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రహదారిపై వినతిపత్రాలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:'వ్యాపారస్థుల సాధికారతకు కట్టుబడి ఉన్నాం'

ABOUT THE AUTHOR

...view details