తెలంగాణ

telangana

Deer in House: చుక్కల దుప్పి.. ఎంచక్కా ఇంట్లోకి..!

By

Published : Jul 15, 2021, 6:54 PM IST

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది ఓ చుక్కల దుప్పి. ఎక్కడి నుంచో జనావాసాల్లోకి వచ్చిన ఆ దుప్పి ఇంట్లోకి ప్రవేశించి హైరానా పుట్టించింది. చివరకు అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో వారొచ్చి దానిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ సంఘటన ఏపీలోలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలంలో జరిగింది.

Deer in House
Deer in House

ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో ఓ దుప్పి.. అనూహ్యంగా శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షమైంది. గదిలోకి ఆవు దూడ వెళ్లిందని భావించిన కుటుంబ సభ్యులు.. లోపలకి వెళ్తే దుప్పి కనిపించే సరికి అవాక్కయ్యారు. దుప్పిని లోపలే ఉంచి గదికి తాళం వేశారు. ఆత్మకూరు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఫారెస్ట్​ అధికారి పిచ్చిరెడ్డి తన బృందంతో వచ్చి.. ఆ దుప్పిని పట్టుకున్నారు.

Deer in House

అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించే క్రమంలో దుప్పి గాయాలపాలైంది. చికిత్స చేసిన అధికారులు దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కనిగిరి రిజర్వాయర్ అటవీ ప్రాంతం నుంచి గానీ.. నరసింహకొండ అటవీ ప్రాంతం నుంచి గానీ దుప్పి వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

HEAVY RAINS: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు!

ABOUT THE AUTHOR

...view details